భారత్‌లో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. రెండురోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 43,509 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రికవరీ కేసుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది… తాజా బులెటిన్ ప్రకారం 38,465 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,03,840గా ఉన్నాయి.. రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని బులెటిన్ లో పేర్కొంది సర్కార్… ఒకేరోజు 17,28,795 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 46,26,29,773కి చేరింది. ఇక, మరో 640 మంది కోవిడ్ బాధితులు తాజాగా మరించారు.. దీంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.22 లక్షలకు చేరింది.