కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో, ఆఫ్ఘనిస్థాన్, వెనిజులా, బెలారస్, వియత్నాం దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు నేరుగా కానీ, ఇతర దేశాల నుంచి కానీ వెళ్లినా ఆంక్షలను ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆంక్షలు మూడు ఏళ్ల పాటు అమల్లో ఉంటాయని పేర్కొంది..