ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 39,742 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 535 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 39,972 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,71,901కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,05,43,138 కి పెరిగాయి……
టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే పతకాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు.. అయితే, ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతుందని అంతా ఆశలు పెట్టుకున్నా.. కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. మరోవైపు.. ఈసారి మరిన్ని అంచనాలు…
తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి కావాలి.. అప్పుడే తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధి దేశం మొత్తం జరుగుతుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు పెద్దగా కనిపించలేదు… అందుకే కరువు కాటకాలు ఎదుర్కుంటున్నారని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ భవిష్యత్ దృష్టితో హరితహారం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని.. కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. ఇక,…
రత్‌లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టున ఘనత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు దక్కింది.. అయితే, అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. 1991 నాటికి భారత్‌లో ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది.. ఉత్పత్తి, ఖర్చు, వినియోగం ఇలా అన్నీ ప్రభుత్వమే చూసుకునేది.. అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చారు.. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ…
భారత్ కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది… కాకపోతే.. రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు మాత్రం నమోదు అవుతున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,097 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 546 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 35,087 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159కు చేరుకోగా… రికవరీ…
మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది నోకియా.. అతి తక్కువ ధరకే 4జీ ఫీచర్ ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది.. నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనుండగా.. యల్లో ఆక్వా, బ్లాక్ కలర్లో లభించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మకాలకు సిద్ధంగా ఉంటాయని ప్రకటించింది ఆ సంస్థ.. క్లాసిక్, నియోల మేళవింపుతో నోకియా 110 4జీ…
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్ కే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు శ్రీలంక 47 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే… పృథ్వీషా 49 పరుగులు, సంజు శాంసన్ 46 పరుగులు, సూర్యకుఆర్ యాదవ్…
కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు మొదటగా బౌలింగ్ చేయనుంది.జట్లు వివరాలు :ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), సంజు సామ్సన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్,…