మనదగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు… అందులో తప్పని సరిగా వాట్సప్ ఉండి తీరుతుంది. వాట్సప్‌కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. అయితే, ఈ వాట్సప్ ఎంత వరకు సురక్షితం. యూజర్ల డేటాకు ఎంత వరకు భరోసా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ సురక్షితం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ వాట్సప్ విదేశీసంస్థకు చెందినది కావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. వాట్సప్‌కు పోటీగా ఎన్ని షార్ట్ మెసేజ్ యాప్‌లు వచ్చినా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా భారత…
కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
భారత్‌లో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. రెండురోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 43,509 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రికవరీ కేసుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది… తాజా బులెటిన్ ప్రకారం 38,465 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,03,840గా ఉన్నాయి.. రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని బులెటిన్ లో పేర్కొంది సర్కార్… ఒకేరోజు…
టీమిండియాతో జరిగిన రెండో టీట్వంటీ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెల్చి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకజట్టుకు.. బౌలర్లు చక్కని ఆరంభాన్నిచ్చారు. ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లంకేయులు.. భారత్‌ను స్వల్పస్కోరుకు కట్టడి చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కెప్టెన్ ధావన్ 42 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా…
కరోనా మమహమ్మారి నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును మరోసారి పొడిగించింది… వచ్చే నెల 31 (ఆగస్టు)వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం.. మరోవైపు ఇప్పటికీ కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక, కరోనా కేసులు తగ్గినప్పటికీ నిబంధనలు పాటించాలని పేర్కొంది.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం…
శ్రీలంకలో భారత, లంక జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి టీ20లో ఇండియా జట్టు విజయం సాధించింది. ఎలాగైనా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సమం చేయాలని లంక జట్టు చూస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జట్టును కట్టడి చేయడంలో లంక బౌలర్లు సఫలం అయ్యారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టేందుకు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పడ్డారు. ఇండియా టీమ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేయగా, రుతురాజ్…
టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ఇవాళ రెండో టీ-20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్ ను నెగ్గిన శ్రీలంక జట్టు… మొదటగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. జట్ల వివరాలు : శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా…
కరోనా సెకండ్ వేవ్ నుంచీ ఇంకా దేశం పూర్తిగా కొలుకోలేదు. చాలా రంగాల్లో పనులు మొదలైనప్పటికీ థియేటర్లు మాత్రం మూతపడే ఉంటున్నాయి. కాకపోతే, హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు ప్రధానమైన మార్కెట్లు… ముంబై, ఢిల్లీ నగరాలు. ఈ రెండూ చోట్లా ఇంత కాలం థియేటర్లు తెరుచుకోలేదు. కానీ, ప్రస్తుతం దేశ రాజధానిలో 50 శాతం ప్రేక్షకులతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఆర్దిక రాజధాని ముంబైలో మాత్రం బిగ్ స్క్రీన్స్ ఇంకా వెలవెలబోతున్నాయి. ముంబై మార్కెట్లో సినిమా విడుదల…
భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. గత బులెటిన్‌లో 30 వేలకు దిగువకు వెళ్లిపోయిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఏకంగా 43 వేలు దాటేశాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 17,36,857 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి పాజిటివ్‌గా తేలింది.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఒకేరోజు 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల…