ఫేక్ న్యూస్‌పై సీజేఐ ఎన్వీ రమణ అసహనం.. సోషల్ మీడియాపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వార్త ఏదో.. వైరల్ ఏదో తెలియని పరిస్థితి… అయితే, సోషల్‌మీడియాలో నకిలీ వార్తల ప్రచారంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సోషల్‌మీడియా, వెబ్ పోర్టళ్లలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని మాధ్యమాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలోనే చూపుతున్నారని, దీని వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. తబ్లీగి జమాత్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. సోషల్‌మీడియా, వెబ్ పోర్టళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రతి విషయాన్ని మత కోణంలో చూపుతున్నారు.. ఇది దేశంపై దుష్ప్రభావం చూపుతోందన్నారు సీజేఐ.
సోషల్‌మీడియా, వెబ్ పోర్టళ్లలో కంటెంట్ విషయంలో జవాబుదారీతనం కనిపించడంలేదన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందని.. సామాజిక మాధ్యమాలు దేనినైనా ప్రచురించగలుగుతున్నాయి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే అవకాశం ఉందని.. నియంత్రణ వ్యవస్థ లేక వ్యక్తుల పరువుకు నష్టం జరుగుతోందని.. వ్యవస్థలు, న్యాయమూర్తులను కూడా చెడుగా చూపిస్తున్నారంటూ సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఇక, సోషల్‌మీడియా సంస్థలు కేవలం బలవంతుల మాటలనే వింటున్నాయని, ఎలాంటి జవాబుదారీతనం లేకుండా వ్యవస్థలు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. సామాజిక మాధ్యమ వేదికలు సామాన్యులకే కాదు.. న్యాయమూర్తులకు కూడా స్పందించట్లేదని.. ఈ పరిణామాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీ నిబంధనలపై అన్ని హైకోర్టుల్లో దాఖలపై పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. వీటిపై ఆరు వారాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!