భారత్ ఆస్తులను లక్ష్యంగా చేసుకొని పాక్ కొత్త ఎత్తులు వేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలీబన్లు ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని భారత్ కు సంబందించిన ఆస్తులను ధ్వంసం చేసేందుకు తాలీబన్ ఉగ్రవాదులతో చేతులు కలిపింది. పాక్ చెందిన 10వేల మంది సాయుధులు ఆఫ్ఘన్‌లోకి అడుగుపెట్టారు. వీరు భారత్ సహకారంతో నిర్మించిన ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లను ధ్వంసం చేయబోతున్నారు. ఆఫ్ఘన్ పుననిర్మాణంలో భాగంగా భారత్ ఆ దేశంలో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కొత్త పార్లమెంట్ భవనంతో పాటుగా అనేక…
కొలంబో తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీం ఇండియా ఘన విజయం సాధించింది. 36.4 ఓవర్లలోనే శ్రీలంక విధించిన లక్ష్యాన్ని టీం ఇండియా అవలీలగా చేధించింది. ఇక ఇరు జట్ల స్కోర్ల వివరాల్లోకి వస్తే… నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి… శ్రీలంక జట్టు 262 పరుగులు చేసింది. 263 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన టీం ఇండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి..…
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసి… తొమ్మిది వికెట్లు కోల్పోయింది. మొదట ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక జట్టును టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. ఇక శ్రీలంక బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 32 పరుగులు, భానుక 27 పరుగులు, కెప్టెన్ శనక 39 పరుగులు చేసి శ్రీలంక జట్టును ఆదుకున్నారు. శ్రీలంక జట్టులో మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. అటు టీమిండియా బౌలర్లలో కుల్దీప్…
భారత్-శ్రీలంక మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే…మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి.…
కరోనా మూడో వేవ్ సీరియస్ గా ఉండకపోవచ్చు అని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా వ్యాపించే వైరస్ రకం గనక వెలుగులోకి రాకపోతే అంత ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. ఆగస్టు చివర్లో మూడో వేవ్ వస్తుందో, రాదో తెలిసిపోతుందన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం అసలైన సవాళ్లు అని పేర్కొన్నాడు. ప్రస్తుత జాగ్రత్తల…
క్రికెట్ లవర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ. టీ20 ప్రపంచ కప్ డ్రాను విడుదల చేసింది. ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూపులో చోటు సంపాదించాయి. దీంతో లీగ్ దశలోనే దాయాదుల పోరు ఉంటుంది. ఇధి అభిమానులకు పండుగనే చెప్పాలి..! యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరుగబోయే టీ20 ప్రపంచకప్ 2021 డ్రాను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించగా,…
ఇండియాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 38,079 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908 కి చేరింది. ఇందులో 3,02,27,792 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 4,24,025 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 560 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… దీంతో.. క్రమంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. భారత్‌లో కూడా ఈ ప్రక్రియ సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.. వ్యాక్సిన్లపై కూడా ఇప్పటికే పలు అధ్యయనాలు జరగగా.. తాజాగా.. వ్యాక్సినేషన్‌పై ఐసీఎంఆర్ ఆసక్తికర విషయాలను తన అధ్యయనంలో వెల్లడించింది.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం నిర్వహించగా..…
కరోనా ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు ఇంకా దేశమంతటా పూర్తిగా తెరుచుకోకపోవటంతో డిస్నీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9న అమెరికా, బ్రిటన్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ కి దూరంగా ఉండనుంది. నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలిపేలా ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా డిస్నీ ఇండియా సంస్థ చేసింది. అయితే, హాట్ స్టార్ లో ‘బ్లాక్ విడో’…
ఏ సిరీస్ అన్నది కాదు.. అందులో భారత్, పాకిస్థాన్ ఉన్నాయా..? మరీ ముఖ్యంగా.. ఆ రెండు జట్లు ఎప్పుడు తలపటబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు క్రికెట్ ప్రేమికుల్లో ఉంటుంది.. ఇక, భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే.. ఎప్పుడూ క్రికెట్‌ను అంతగా చూడనివారు కూడా ఆ రోజు ఆసక్తిగా వీక్షిస్తుంటారు.. ఇలా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుంది అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను టీ-20 వరల్డ్‌కప్ తీర్చబోతోంది… ఇంకో విషయం ఏంటంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో…