ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 11, 919 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3.38 కొట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,28, 762 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 470 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,64, 623 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,242 మంది కరోనా నుంచి కోలుకోగా…
శీతాకాలంలో హిమాలయా పరివాహ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఆ చలిని తట్టుకొని బోర్డర్లో సైనికులు పహారా నిర్వహించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఒకటి రెండు రోజులు కాదు… నెలల తరబడి గడ్డగట్టే మంచులో చలిని తట్టుకొని నిలబడాలి. శతృవులను ధీటుగా ఎదుర్కొనాలి. Read: ఇకపై హాస్టళ్లలో పిల్లలకు తోడుగా తల్లలు… అయితే, గతానికిపూర్తి భిన్నంగా లద్ధాఖ్‌లో పరిస్థితులు నెలకొన్నాయి. ఇండో – చైనా బోర్డర్ లో పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. బోర్డర్లో చైనా…
రోహిత్-ద్రవిడ్ శకం విజయంతో ప్రారంభమైంది. జైపూర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 165 పరుగుల లక్ష్య ఛేదనను రోహిత్, రాహుల్ జోడీ దూకుడుగా ప్రారంభించింది. 50 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత రాహుల్ (15) వెనుతిరిగినా… సూర్యకుమార్ యాదవ్ (62) సిక్సులు, ఫోర్లతో ఎడాపెడా బాదేశాడు. కెప్టెన్ రోహిత్ (48) దగ్గర ఔట్ అయ్యాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ (5), వెంకటేష్ అయ్యర్ (4) విఫలమైనా…
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. అతిథ్య న్యూజి లాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 164 పరుగలు చేసింది.కాగా ఆరంభంలోనే మిచెల్‌ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. న్యూజిలాండ్ మరో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ శుభారంభాన్ని అందిచాడు. 42 బాల్స్‌లో 70 పరుగులు చేశాడు. దీపక్ చాహార్ బౌలింగ్‌లో శ్రేయస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో బ్యాట్స్‌మెన్ చాప్మెన్ 63 పరుగులు చేశాడు. చాప్ మెన్ అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాత ఫిలిప్స్‌ను…
నేడు న్యూజిలాండ్ – టీమిండియా జట్ల మధ్య మొదటి టీ 20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే… న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్…
ఇండియా… పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాశ్మీర్ అంశం తరువాత రెండు దేశాల మధ్య మరింత దూరం పెరిగింది. కాగా, సుదీర్ఘకాలంగా మూసుకున్న సరిహద్దులు తిరిగి తెరుచుకోబోతున్నాయి. గురునానక్ జయంతోత్సవాల్లో భాగంగా కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను తిరిగి తెరుస్తున్నారు. ఈనెల 17 వ తేదీన ఈ కారిడార్ ను తెరవబోతున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపిన సంగతి తెలిసిందే. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున…
మనిషి జీవించాలి అంటే గాలి ఉండాలి. ఎక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుందో అక్కడి ప్రజలు ఆరోగ్యవంతంగా జీవిస్తారు. శీతాకాలం వచ్చింది అంటే అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం పొగమంచు కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. దీని వలన ప్రజలు శ్వాససంబంధమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. దేశరాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యాన్ని వాల్యూ ఇండెక్స్‌లో కొలుస్తారు. Read: అధికారులకు షాక్: టీకాలు వేసేందుకు ఆ…
పౌరవిమానాలు లేదా యుద్దవిమానాలు ల్యాండింగ్ కావాలంటే ప్రత్యేకమైన రన్వేలు ఉండాలి. మాములు రోడ్డుపై విమానాలు దిగలేవు. ఒకవేళ యుద్దసమయంలో కావొచ్చు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు కావొచ్చు సైన్యాన్ని వివిధ ప్రాంతాలకు వేగంగా తరలించాలి అంటే అత్యవసర రన్‌వే వ్యవస్థలు అవసరం అవుతుంటాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని జాతీయ రహదారులను యుద్దవిమానాలు ల్యాండింగ్ కు అనుకూలంగా మార్చేందుకు ప్రణాళికలు వేసింది. Read: అమెరికా తైవాన్‌కు సపోర్ట్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనా…? ఇప్పటికే…
మైసూరును పాలించిన టిప్పుసుల్తాన్ సింహాసనాన్ని వేలం వేసింది బ్రిటన్ ప్రభుత్వం.. సింహాసనంలోని ముందరి భాగాన్ని వేలానికి పెట్టారు.. వజ్రాలతో పొదిగిన పులి తల ఆకృతిని భారత కరెన్సీలో దాదాపు రూ.15 కోట్లకు వేలానికి పెట్టింది. వేలంలో ధరను £1.5 మిలియన్లుగా నిర్ణయించింది.. మన కరెన్సీ ప్రకారం.. రూ. 14,98,64,994కు వేలం వేస్తోంది.. 18వ శతాబ్దంలో భారత్‌లోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్.. అయితే, భారత్ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్యమైన సంపదను ఇలా బ్రిటన్ బహిరంగంగా వేలం వేయడంపై…
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా రద్దు అయ్యాయి.. కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులకు మాత్రమే ఆయా దేశాలు అనుమతి ఇస్తూ వచ్చాయి… ఇక, కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఒక్కో దేశం అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతి ఇస్తూ వస్తున్నాయి.. తాజాగా వివిధ దేశాల ప్రజలకు సింగపూర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. నవంబరు 29వ తేది నుంచి ఇండోనేషియా, భారత పౌరులు సింగపూర్‌కి ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు.. డిసెంబరు 6వ తేదీ నుంచి…