మరోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది భారత్.. మిస్ యూనివర్స్‌గా మిస్ ఇండియా ఎంపికైంది.. పంజాబ్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధూ.. ఈ టైటిల్‌ను గెలుచుకుంది. సుమారుగా 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ మూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్‌కౌర్ మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఇజ్రాయిల్‌లో 70వ మిస్ యూనివర్స్ పోటీలు జరిగాయి. దక్షిణాఫ్రికా యువతి నుంచి ఎదురైన పోటీని ఎదుర్కొని విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పంజాబ్ యువతి… గత ఏడాది మిస్ యూనివర్స్‌గా ఎంపికైక ఆండ్రియా మెజా.. హర్నాజ్ కౌర్‌కు కిరీటాన్ని బహుకరించారు.
ఇక, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హర్నాజ్ విజయం సాధించినట్టు ఓ పోస్టు పెట్టింది.. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో అందాల రాణి గౌరవనీయమైన టైటిల్‌ను గెలుచుకున్న వార్తను ప్రకటించారు.. “కొత్త మిస్ యూనివర్స్ ఈజ్…ఇండియా,” అంటూ క్లిప్‌కి క్యాప్షన్ ఇచ్చారు. క్లిప్‌లో మెక్సికోకు చెందిన మిస్ యూనివర్స్ 2020 ఆండ్రియా మెజా తన వారసురాలిగా మారిన హర్నాజ్‌కి పట్టాభిషేకం చేశారు.. ఇక, మిస్ యూనివర్స్‌గా ఎంపికైన మిస్ ఇండియా హర్నాజ్ ఆనందానికి అవదులులేకుండా పోయాయి..