కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలవడం ఇది వరుసగా మూడో సారి. ఇప్పటివరకు రోహిత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్, అశ్విన్‌లకు రెస్ట్ ఇచ్చిన జట్టు మేనేజ్మెంట్… ఇషాన్ కిషన్, చాహల్‌ను తీసుకుంది. అటు న్యూజిలాండ్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. సౌథీ…
ఇండియాలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,488 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,10,413 కి చేరింది. ఇందులో 3,39,22,037 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,22,714 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 313 మంది మృతి చెందారు. దీంతో…
ఇవాళ రాజస్థాన్ కొత్త మంత్రి వర్గం కొలువుదీరనుంది. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేసింది. శాసనసభలో 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం.. కేబినెట్లో గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గానికి మంత్రి వర్గ విస్తరణలో ప్రధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పైలట్ టీంకు మెజార్టీ…
టీ-20 సిరీస్ వైట్‌వాష్‌పై కన్నేసింది రోహిత్‌సేన. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా…చివరి ఫైట్‌కు రెడీ అయ్యింది. ఈ సిరీస్ తర్వాత టెస్టు ప్రారంభం కానుండటంతో కొన్ని ప్రయోగాలు చేయనుంది. సొంత గడ్డపై టీమిండియా దుమ్మురేపుతోంది. టీ-20 సిరీస్‌లో ఇప్పటికే రెండింటిలో గెలిచిన సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కేప్టెన్సీలో టీమిండియా అందుకున్న తొలి టీ20 సిరీస్ ఇదే. అదే ఊపుతో చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.న్యూజిలాండ్ ఇంకా బోణీ కొట్టలేదు. తొలి…
ఐపీఎల్ 2022 ఇండియా లోనే జరుగుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ.. ఇక్కడ చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడటం కోసం మీరంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఆ క్షణం ఎంతో దూరంలో లేదు, ఐపీఎల్ 15వ సీజన్ భారతదేశంలో జరుగుతుంది. అలాగే ఈ ఐపీఎల్ కొత్త జట్లు చేరడంతో మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. అయితే ఈ ఐపీఎల్ కోసం…
మన దేశంలో కరోనా కేసులు మరోసారి కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 10,302 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 267 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,99,925 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,24,868 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా…
దేశ వ్యాప్తంగా 22.45 కోట్లకుపైగా టీకా డోసుల నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మిగులు డోసులు ఉండటం తో టీకా వాణిజ్యపర ఎగుమతులపై కేంద్రప్రభుత్వం త్వరలోనే నిర్ణ యం తీసుకునే అవకాశం ఉంది. నవంబర్ నెలలో దాదాపు 31 కోట్ల డోసుల్ని డెలివరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 20నుంచి 22 కోట్ల డోసుల కంటే ఎక్కువ పంపిణీ చేస్తాయని అనుకోవడం లేదు. మిగిలిన వాటిని ఎగుమతి చేస్తామని సంబంధిత అధికారి ఒకరు…
రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపర్ చాహర్ న్యూజిలాండ్…
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై గత ఏడాది కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను ఈరోజు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. Read: చంద్రబాబు సంచలన నిర్ణయం: ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వస్తా… శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు. రైతులు చేసిన పోరాటం ఫలించిందని…
రైతు చట్టాలు రద్దు చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మోడీ రైతు చట్టాలు రద్దు చేశారని.. ఈ సందర్భంగా బ్రోకర్ లకు శుభాకాంక్షలు అంటూ రాజా సింగ్ పేర్కొన్నారు. రైతులకు మేలు జరగాలనే ప్రధాని మోడీ ఈ చట్టాలు తీసుకొచ్చారు… పంట అమ్ముకుంటే రైతులకు లాభం రావాలి కానీ బ్రోకర్లకు కాదన్నారు. అందుకే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చినట్లు స్పష్టం చేశారు రాజా సింగ్. అన్నదాతలు…