అంతరిక్ష రంగంలో ఇండియా దూసుకుపోతున్నది. ఇండియా అంతరిక్ష కేంద్రం ఇస్రో చేపట్టిన ఎన్నో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. మార్స్ మీదకు ఇండియా మామ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. అతి తక్కువ ఖర్చుతో మొదటిసారి చేపట్టిన ప్రయోగం విజయవంతమైన దేశంగా ఇండియా ఖ్యాతిగాంచింది. చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపినా చివరి నిమిషంలోవాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చంద్రునిపై చంద్రయాన్ ఉపగ్రహం ల్యాండింగ్ కాలేకపోయింది.
Read: కేరళను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ… అలప్పుజలో అలర్ట్..
ఇక ఇదిలా ఉంటే, 2023లో ఇండియా గగన్‌యాన్ ప్రయోగం చేయబోతున్నది. వ్యోమగాములను స్పేస్‌లోకి పంపడమే గగన్‌యాన్ లక్ష్యం. దానికంటే ముందు 2022లో మానవరహిత ప్రయోగం గగన్‌యాన్ ప్రయోగం చేస్తున్నది. ఈ ప్రయోగం విజయవంతమైతే 2023లో మానవసహిత గగన్‌యాన్ ప్రయోగం చేస్తుంది. ఇక, 2030 వరకు ఇండియా సోంతంగా స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ స్పేస్ స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇస్రో.