దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటిస్తోంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటున్న జట్టు ఆ తర్వాత మూడు వన్డేలను ఆడనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్టర్లు భారత జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈ వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. గాయం కారణంగా రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్‌కు వన్డే పగ్గాలను అప్పగించారు. బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్,…
అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దుబాయిలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 38 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 21.3 ఓవర్లలో 104/1 స్కోరు చేయగా.. వర్షం పడటంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం…
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్‌లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్లు వారు పేర్కొన్నారు. Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా అయితే ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన వృద్ధుడికి హైపర్‌టెన్షన్‌తో పాటు డయాబెటిస్…
ప్రపంచాన్ని వివిధ రూపాల్లో ఇప్పటికే భయపెడుతూనే ఉంది కరోనా మహమ్మారి.. ఓవైపు డెల్టా మళ్లీ పంజా విసురుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది.. అయితే, కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. భారత్‌లో తయారు చేసిన వ్యాక్సిన్లను విస్తృతంగా ప్రజలకు వేస్తున్నారు.. ఇక, ఇదే సమయంలో విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చారు.. మరోవైపు.. కరోనా చికిత్సలో అద్భుతమైన ఔషధంగా చెబుతున్న టాబ్లెట్ మార్కెట్లోకి వచ్చేసింది.. ‘మోల్నుపిరావిర్’ పేరుతో…
ఊహించినట్టే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో ప్రపంచ దేశాలు మారోసారి ప్రమాదంలో పడ్డాయి. దీని మూలంగా భారత్‌లో కారోనా థర్డ్‌వేవ్ మొదలైంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో అధిక సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాలుస్తుందనటానికి ఇది సంకేతం. ఐతే, థర్డ్ వేవ్‌ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే సెకండ్ వేవ్ నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఒమిక్రాన్…
ఆసియా కప్ క్రికెట్ అండర్-19 ఫైనల్లోకి భారత యువ జట్టు అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో ఫైనల్‌కు చేరింది. తొలుత బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. షేక్ రషీద్ 90 పరుగులు చేశాడు. విక్కీ (28), కెప్టెన్ యష్ (26), రాజ్ బవా…
కరోనా కారణంగా గత ఏడాది చుక్కలు చూపించిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే ఏడాది మరోసారి 10 గ్రాముల బంగారం ధర రూ.55వేలకు చేరుతుందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా బంగారం దిగుమతి తగ్గిపోవడంతో డిమాండ్ దృష్ట్యా 2020లో 10 గ్రాముల బంగారం రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 10 శాతం తగ్గింది. Read Also: బీమా కంపెనీల…
దేశంలో ఒమిక్రాన్ కేసులు అలజడి రేపుతున్నాయి. కేసుల్లో ఢిల్లీని అధిగమించింది మహారాష్ట్ర. పెరుగుతున్న కేసులు వల్ల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు కలిసి పెద్ద ఎత్తున సునామీ లాగా కేసుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో. గతవారం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 11 శాతం పెరిగాయని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం…
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్నారు. అయినప్పటికీ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఒమిక్రాన్ కేసులు క్రమంగా చాపకింద నీరులా పెరుగుతున్నాయి. 1.44 బిలియన్ జనాభా కలిగిన భారత దేశంలో సెకండ్ వేవ్ సమయంలో కేసులు ఏ స్థాయిలో విజృంభణ జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. Read: గోదావరిపై తెలంగాణ అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోంది : ఏపీ అయితే, ఇప్పుడు ఒమిక్రాన్…
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాటికి భారత్‌లో కొత్తగా 6,358 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 653 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అంటే మొత్తం కేసులలో ఇది దాదాపు పది శాతం. ఒమిక్రాన్ సంక్రమించిన వారిలో 186 మంది కోలుకున్నారు. కరోనా కేసుల్లో మహారాష్ట్ర మొదటి నుంచీ ముందున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒమిక్రాన్ విషయంలో ఆ రాష్ట్రమే అదే టాప్. మంగళవారం నాటికి కొత్త వేరియంట్ కేసుల సంఖ్య…