కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తెస్తామని… అయితే.. ఈ సారి సాగు చట్టాలను స్పల్ప మార్పులతో తెస్తామని ప్రకటన చేశారు. వ్యవసాయ సాగు చట్టాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతుందని.. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందన్నారు. రైతులకు ఆమోద యోగ్యంగా చట్టాలను రూపొందించి… పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి కసరత్తు జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ అన్నారు. కాగా.. ఇటీవలే.. కేంద్ర…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు చమురుతో నడిచే వాహానాలను పక్కనపెట్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహానాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో కొత్త కార్లకు క్రమంగా డిమాండ్ తగ్గుతుండగా, పాత కార్లకు అదే రేంజ్లో డిమాండ్ పెరుగుతున్నది. 2020-21 సంవత్సరంలో జరిగిన ఆర్థికపరమైన మార్పుల కారణంగా వినియోగదారులు పాతకార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. Read: టీడీపీలో ఇంఛార్జుల నియామకంపై ప్రకంపనలు..! మెగా సిటీల్లోనే…
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‌లో గరిష్ట స్థాయికి కేసులు చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్ వస్తుందని వారు అంచనా వేశారు. థర్డ్ వేవ్‌ను అంచనా వేయడానికి పరిశోధకుల బృందం గాస్సియన్ మిక్సర్ మోడల్‌ను ఉపయోగించింది. Read Also: ఒమిక్రాన్ పై యూపీ సర్కార్ కీలక నిర్ణయం…
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కాసేపటి క్రితమే ఈ ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.…
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు…రోజు రోజుకు పెరుగుతున్నాయ్. క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్ వేడుకలపై…పలు రాష్ట్రాలు నిషేధం విధించాయ్. గుజరాత్, మధ్యప్రదేశ్ నైట్ కర్ఫ్యూ విధించాయ్. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లలో డీజేల వినియోగంపై కర్ణాటక నిషేధం విధించింది. ఒమిక్రాన్…దేశంలో కలకలం రేపుతోంది. కొత్త వేరియంట్ కేసులతో పాటు కొవిడ్ కేసులు కూడా రోజురోజుకీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ్. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని… వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మళ్లీ కఠిన…
పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది.. పనిలో పనిగా అందినంత దండుకునే పనిలో పడిపోయాయి రవాణా సంస్థలు.. రద్దీ పెరిగిందంటే చాలు.. అదనపు వడ్డింపులు తప్పవనే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ రద్దీతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. తమిళనాడులోని చెన్నై నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా వెళ్లే విమాన సర్వీసులపై ఆయా విమాన సంస్థలు…
పాశ్చాత్య చిత్ర పరిశ్రమకు హాలీవుడ్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు బాలీవుడ్ అలా. ప్రపంచం దృష్టిలో భారతీయ సినిమా అంటే హిందీ సినిమా. ఐతే, ఇప్పుడు ఆ ముద్ర చెరిగిపోతోంది. అసురన్, జైభీమ్, పుష్ప వంటి సినిమాలు బాలీవుడ్‌పై టాలీవుడ్ పై చేయి సాధిస్తోంది అని చెప్పటానికి ఉదాహరణలు. అసురన్ పలు అంతర్జాతీయ ఆవార్డులు గెలుచుకోగా.. జై భీమ్ భారీ హాలీవుడ్ సినిమాలను తలదన్ని ఇంటర్నెట్ టాపర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ఫ వసూళ్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే 170…
2021 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ తర్వాత ప్రజలు ఎక్కువ చర్చించుకున్నది… ఇబ్బంది పడింది పెట్రోల్ ధరల విషయంలోనే. ఎందుకంటే దేశంలో ఈ ఏడాది లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 దాటింది. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది రూ.100పైనే ఉంది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు దేశీయ సుంకాలు తోడవడంతో సామాన్యుడు పెట్రోల్ ధరల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర…