భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు తీవ్రస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్‌లో 33,750 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 123 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో మృతి…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ సాగుతోంది.. భారత్‌లోనూ ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తిచేశారు.. సెకండ్ డోస్ వేస్తున్నారు.. ఇక, టీనేజర్లకు కూడా టీకా వేసేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…
ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతుండగా… ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, పార్కులు మూసివేస్తున్నట్లు తెలిపింది. Read Also: కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ,…
ఒకవైపు కోవిడ్ వ్యాప్తి, మరోవైపు ఒమిక్రాన్ దాడితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. అందుకే భారత ప్రభుత్వం 15-18 ఏళ్ళ వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అయింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు కోవిన్ యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర…
ఢిల్లీలో ఆర్ ఫ్యాక్టర్ 2కి చేరింది. దీంతో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్ ఫ్యాక్టర్ 1 ఉంటేనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఇప్పుడు అది 2 కి చేరడంతో వ్యాప్తి భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. మరోవైపు కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రులను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ప్రత్యేక…
నూతన సంవత్సరం సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న మెంధార్ హాట్ స్ప్రింగ్స్, పూంచ్ రావల్ కోట్, చకోటి ఉరి, చిల్లియానా తివాల్ క్రాసింగ్ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ‘2022 సంవత్సరం ప్రారంభంలో, పరస్పర విశ్వాసం, ప్రశాంతతను పెంపొందించడానికి, పూంచ్, మెంధార్ క్రాసింగ్ పాయింట్ల వద్ద భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంతో స్వీట్లు పంచుకుంది` అని జమ్మూ ఆధారిత రక్షణ…
కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు మానవతా దృక్పదంలో సహాయం చేసింది. అమెరికాతో సహా అనేక దేశాలకు మందులను సప్లై చేసింది. కోవిడ్ మొదటి దశలో ఇండియా నుంచి మలేరియా మెడిసిన్‌ను వివిధ దేశాలకు ఉచితంగా సప్లై చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తరువాత కూడా ఇండియా మిత్ర దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను మానతవతా దృక్పధంలో అందించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేసింది.…
భారత్‌లో మళ్లీ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.. మూడు రోజుల క్రితం పదివేలకు దిగువన ఉన్న కేసులు.. ఇవాళ ఏకంగా 22 వేల మార్క్‌ను కూడా దాటేశాయి… ఇక, భారత్‌లో కేసుల పెరుగుదల చాలా వేగంగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చేసిన హెచ్చరికలు కలకలం సృష్టిస్తున్నాయి.. ఈ సమయంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. Read Also: భారత్‌లో కరోనా…
భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది… మొన్న 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, నిన్న 16,764 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, ఇవాళ అమాంతం ఆ సంఖ్య పెరిగిపోయింది.. ఏకంగా 22 వేలను దాటేసింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 406 మంది కోవిడ్…
చైనా మరోసారి కుటిలబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే చైనా పేర్లను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. అయితే, చైనా దానికి ససేమిరా అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగస్వామ్యమని, దక్షిణ టిబెట్‌గా తాము పిలుస్తామని, తమ భూభాగంలోని ప్రదేశాలకు పేర్లు పెట్టుకుంటామని, తన సార్వభౌమత్వానికి ఎవరూ అడ్డు వచ్చినా ఊరుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. ఆరుణాచల్ ప్రదేశ్‌లోని 15 భూభాగాలకు చైనా పేర్లు…