దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని…ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని కేసీఆర్ చెప్పారు. దీనిపై కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ అంటున్నారని… అయితే యూపీలో ఎవరు గెలిచినా ఈసారి బీజేపీకి సీట్లు అయితే తగ్గుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇది బీజేపీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. దేశానికి కొత్త రాజ్యాగం కావాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం హోదాలోనే దేశం కోసం పోరాడతాడనని స్పష్టం చేశారు.
Read Also: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 40వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గుజరాత్ సీఎంగా ఉండి మోదీ ప్రధాని అయ్యారని కేసీఆర్ గుర్తుచేశారు. ఈనెల 5న ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తే స్వాగతం పలుకుతానని… ప్రోటోకాల్ పాటిస్తానని కేసీఆర్ తెలిపారు. అయితే తన మనసులోని అన్ని విషయాలను ప్రధానికి చెప్తానని పేర్కొన్నారు. అటు త్వరలో హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సదస్సు జరగనుందని.. ఈ సమావేశంలో దేశంలోని పరిస్థితులపై చర్చిస్తామని తెలిపారు. మేధో మథనం తరువాత పోరాట కార్యక్రమంపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మోదీ టోపీలు, పంచెలు మార్చితే అభివృద్ధి అంటామా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలో ఎంఐఎం గెలిస్తే మంచిదేనని, అసద్ తెలంగాణ వ్యక్తే కదా అన్నారు. ప్రధానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అన్నారు. దేశ ఆర్థిక పరిమితి పెంచే అవగాహన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.