దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలను సడలించింది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులపై గతంలో విధించిన నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.
Read Also: భారత్‌లో మరో కొత్త కల్చర్… ఇకపై వారానికొకసారి
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండోర్ సమావేశాలు నిర్వహించాలంటే ఆ హాలు సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే హాజరుకావాల్సి ఉంటుందని.. ఓపెన్ గ్రౌండ్లో అయితే 30 శాతం మందితో మాత్రమే సమావేశం నిర్వహించాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. అటు ఇంటింటి ప్రచారంలో కేవలం 20 మందే పాల్గొనాలని… రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు ఎన్నికల ప్రచారంపై నిషేధం ముందులానే వర్తిస్తుందని సీఈసీ తెలిపింది.