ఎలన్ మస్క్‌కు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. టెస్లా కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు కేంద్రం నో చెప్పింది. అయితే, పాక్షికంగా తయారు చేసిన ఈవీ వాహనాలను ఇండియాలో అసెంబ్లింగ్ చేయడం ద్వారా దిగుమతి సుంకం తగ్గుతుందని కేంద్రం మరోసారి పేర్కొన్నది. టెస్లా కంపెనీ ఇండియాలో ఏర్పాటు చేసే ప్లాంట్, భవిష్యత్‌పై నివేదిక కోరగా, ఇప్పటి వరకు టెస్లా నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, ఇప్పటికే దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారవుతున్నాయని, వివిధ విదేశీ కంపెనీలు పాక్షికంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి ఇండియాలో అసెంబ్లింగ్ చేస్తున్నారని, వాటికి లేని దిగుమతి సుంకాల సమస్య కొన్నింటికి ఎందుకు వస్తుందని కేంద్రం ప్రశ్నించింది.
Read: రోడ్డుపై 186 కిలోల గోల్డెన్ క్యూబ్…షాకైన ప్రజలు…
2019వ సంవత్సరంలోనే టెస్లా కంపెనీ ఇండియాలో కార్లను ప్రవేశపెట్టాలని చూసింది. అయితే, దిగుమతి సుంకాలు 100 శాతం ఉండటంతో ఆ కంపెనీ వెనక్కి తగ్గింది. అయితే, టెస్లా కంపెనీకి అనేక రాష్ట్రాలు ఆహ్వానం పలుకుతున్నాయి. టెస్లా కంపెనీ ప్లాంట్‌ను నెలకొల్పితే రాయితీలు ఇస్తామని చెబుతున్నాయి.