గత కొంతకాలంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండియా చైనా బోర్డర్‌లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. బోర్డర్‌లో చైనా నిర్మాణాలను నిర్మిస్తున్నది. దీంతో ఇండియా కూడా చైనాకు ధీటుగా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నది. చైనా బోర్డర్‌లోని తవాంగ్ లోని బుద్దపార్క్‌లో పదివేల అడుగుల ఎత్తులోని పర్వతంపై 104 అడుగుల ఎత్తైన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పతాకాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖమంత్రి పెమా ఖండూ ప్రారంభించారు. చైనా బోర్డర్‌లోని సైనికులకు కనిపించేలా ఈ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు.
Read: ఎలన్ మస్క్‌కు మరో షాక్… ఆ డిమాండ్లకు నో చెప్పిన భారత్…
అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భూభాగమే అని, చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. బోర్డర్ సెక్యూరిటీ, ఇండో టిబెటిన్ సైనికులు, సశాస్త్ర సీమాబల్, తదితరుల సహకారంతో ఈ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశంలోనే అత్యంత పెద్దదైన జాతీయ పతాకాల్లో ఇది రెండోదని కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు ట్వీట్ చేశారు. ప్రస్తుతం తవాంగ్‌లో ఏర్పాటు చేసిన ఈ పతాకానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.