ఇప్పుడు పల్లెటూరి నుంచి నగరాల వరకు ఎక్కడ చూసినా హోటళ్లు, రెస్టారెంట్లు మరకు కనిపిస్తుంటాయి. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ నష్టం రాదన్న సంగతి తెలిసిందే. అయితే, కొందరు అధికలాభం కోసం భారీగా ధరలు పెంచి హోటళ్లను రన్ చేస్తుంటారు. అలాంటి హోటళ్ళు ఎక్కువకాలం నిలబడలేవు. కానీ, కొన్ని హోటళ్లు మాత్రం వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వందేళ్లైనా ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ముంబైలోని లియోప్లాడ్ కేఫ్ ఉంది. ఈ కేఫ్‌ను సుమారు 150 ఏళ్ల క్రిందట స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేఫ్ ముంబై నగరవాసులను ఆకర్షిస్తూనే ఉన్నది. 2008 లో జరిగిన ముంబై దాడుల్లో ఈ కేఫ్ చాలా వరకు నష్టపోయింది. ఆ తరువాత కోలుకొని తిరిగి వినియోగదారులను ఆకర్షిస్తున్నది.
Read: దేశంలో విచిత్రమైన రైల్వేస్టేషన్లు… ఆ స్టేషన్లోకి అడుగుపెట్టాలంటే…
అదేవిధంగా కోల్‌కతాలో ఇండియా కాఫీ హౌస్ అనే కాఫీ హోటల్ ఉంది. దీనిని 1876 వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆహారప్రియులను ఈ హోటల్ ఆకర్షిస్తూనే ఉన్నది. అలానే, లఖన్‌పూలోని టండే కబాబ్ సెంటర్ అనే నాన్‌వెజ్ హోటల్ ఉంది. దీనిని సుమారు 115 ఏళ్ల క్రిందట స్ధాపించారు. ఢిల్లీలోని కరీమ్ రెస్టారెంట్‌ను 1913లో స్థాపించారు. ఇక డార్జిలింగ్‌లో సుమారు 130 ఏళ్ల క్రిందట గ్లెనరీ అనే హోటల్‌ను నెలకొల్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హోటల్‌కు ఎలాంటి వన్నె తగ్గలేదు. నిత్యం పర్యాటకులతో ఈ హోటల్ కళకళలాడుతూనే ఉన్నది.