ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం…
దేశంలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి జనవరి 16తో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపు ముద్రించి ఆదివారం నాడు విడుదల చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయినందున ఈరోజు ముఖ్యమైన రోజు అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇండియాలో కరోనా టీకాల పంపిణీని…
టీమ్ ఇండియా సారధిగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌కు శనివారం తెరపడింది. కాదు, తనకు తాను తెర దించాడు. ఆయన నాయకత్వంలో టీంఇండియా ప్రతిభతో నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయపథంలో పరుగులు తీసింది. భారత క్రికెట్ అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన అతిరథ మహారధుడు విరాట్ కోహ్లీ. ఏ ఆటలో అయినా విజయవంతమైన ఆటగాళ్లకు తమదైన ఓ ముద్ర ఉంటుంది. జట్టు సారధికి కూడా తనదైన ప్రత్యేకత ఉంటుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా భారత క్రికెట్‌పై కోహ్లీ…
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, ఒమిక్రాన్ పిల్లలపై పెను ప్రభావమే చూపిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో.. అమెరికా, యూరప్‌ల్లో అధికశాతం చిన్నారులు.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు.అయితే కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా వీటికి కళ్లెం వేయవచ్చంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అనేక దేశాల్లో కొవిడ్ మూడో దశ మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ వేరియంట్ పిల్లలపైనా అధికంగానే ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి రెండు దశల సమయంలో పిల్లలపై అంతగా ప్రభావం చూపని…
★ దేశవ్యాప్తంగా ఈరోజు 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు పార్లమెంట్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 850కి చేరింది. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు ★ ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4, 955 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. మరోవైపు ఏపీలో కరోనా…
టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. 12 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది. Read Also: ఇకనైనా విహారికి అవకాశం ఇవ్వండి:…
డ్రాగన్ కంట్రీ చైనాకు పరోక్షంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె… సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాల సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం సఫలం కానివ్వబోదని ప్రకటించారు.. చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు.. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో…
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.. ప్రపంచంలోనే పేరుమోసిన సంస్థ టెస్లా.. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ.. ఎప్పటికప్పుడూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. టెస్లా కార్లు భారత్‌కు ఎప్పుడొస్తాయి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. తాజాగా.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించడంతో.. మరోసారి ఈ వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక అంశాలపై స్పందించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. వెంటనే ఈ అంశంపై…
కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో మూడు నాలుగు వారాలు పోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారనుంది. ఇప్పటికే దేశంలో రోజుకు వచ్చే కరోనా కేసులు రెండున్నర లక్షలు దాటాయి. మున్ముందు తీవ్రత పీక్ స్టేజ్ కు పోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఇప్పటికి ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య తక్కువగానే ఉన్నా.. ముందు ముందు కేసులెక్కువైతే ఆస్పత్రుల్లో చేరే వాళ్ల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం…