స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా మీర్జా మాట్లాడుతూ… ఇదే తన చివరి సీజన్ అని నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన సానియా మీర్జా ఇదే తన చివరి సీజన్ అని చెప్పింది. తన ఆటతీరుతో ఎన్నో టైటిళ్లను సాధించడంతో పాటు ప్రశంసలు…
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయానా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానసర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలను పొడిగించారు. ప్రస్తుతం జనవరి 31 వరకు నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో డీజీసీఏ ఆంక్షలను మరోసారి పొడిగించాలని నిర్ణయించింది. ఒమిక్రాన్‌కు ముందు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ 15 నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ…
ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా ఎప్పటికీ నాశనం అవుతుందోనని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పటికి అంతమవుతుందో అన్న అంశంపై ఐసీఎంఆర్ అధికారి స్పందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా వెల్లడించారు. Read…
దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.…
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్.. ఇప్పటికే…
సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకున్న కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్… గాయం కారణంగా రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో……
ఈనెల 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలను టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు హెచ్చరికలు అందాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీ సహా ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులపైనా ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ప్రసిద్ధ కట్టడాలు, జనాలు రద్దీగా ఉన్న ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించాయి. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భద్రతా…
ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా దేశంలో 2,38,018 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. నిన్నటి కేసుల కంటే ఈరోజు 20,071 కేసలు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,57,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 310 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 17,36,628 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఇప్పటి…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అయిపోయింది.. దీంతో, క్రమంగా అన్ని ఏజ్ గ్రూపులకు వ్యాక్సిన్ వేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే కాగా.. త్వరలోనే 15 ఏళ్ల లోపు వారికి కూడా టీకాలు వేసేందుకు సిద్ధం అవుతోంది.. ఇవాళ వ్యాక్సినేషన్‌పై మాట్లాడిన జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా… త్వరలోనే…
భారత్‌లో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి 102 నుంచి 142కి పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021 నాటికి భారత్‌లో 142 మంది బిలియనీర్లు ఉండగా… వీరి దగ్గర ఉన్న ఉమ్మడి సంపద విలువ 719 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీలో 53 లక్షల కోట్లు అన్నమాట. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద…