దాదాపు 40 ఏళ్ల తరువాత ఇండియాలో మరో బిగ్ ఈవెంట్ జరగబోతున్నది. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ముంబై వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. 1983లో ఢిల్లీ వేదికగా ఐఓసీ సమావేశాలు జరిగాయి. ఇక ప్రస్తుతం బీజింగ్ వేదికగా జరుగుతున్న 139వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌లో భారత బృందం ఓ ప్రజెంటేషన్ ను ఇచ్చింది. భారత బృందం ఇచ్చిన ప్రజెంటేషన్ పట్ల ఐఓసీ సంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జరిగే ఐఓసీ సెషన్ సమావేశాలు ముంబైలో నిర్వహించేందుకు అంగీకరించారు.
Read: Nikola Kid: ఒంటరి వ్యక్తులు… పెద్దవారి కోసమే…
ఈ కార్యక్రమంలో అభినవ్ బింద్రా, క్రీడల శాఖ మంత్రి ఠాకూర్, నీతా అంబానీ తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ప్రతి ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ, ఐఓసీ సెషన్ సమావేశాల్లో అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలే కీలకంగా ఉంటాయి. అందుకే ఈ సెషన్ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చేందుకు చాలా దేశాలు పోటీ పడుతుంటాయి. ఇప్పటికే పెద్ద పెద్ద క్రీడలను నిర్వహిస్తున్న ఇండియా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ గేమ్స్‌ను నిర్వహించేందుకు ఇలాంటి సెషన్ నిర్వహరణ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.