Ukraine Effect: విమాన సర్వీసులు నిలిపేసిన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఓ విమానయాన సంస్థ తన సర్వీసుల్ని నిలిపేసింది. జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌కు తమ సర్వీసులు ఆపేశామని ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని కీవ్‌తో పోర్టు సిటీ ఒడిసా కూడా నేటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తమ సిబ్బంది, ప్రయాణికుల రక్షణకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని సంస్థ తెలిపింది.
ఈ రెండు ప్రాంతాలకు తప్ప మిగిలిన నగరాలకు మాత్రం ఈ నెలాఖరు వరకు తమ విమాన సేవలు కొనసాగుతాయని లుఫ్తాన్సా తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డచ్ ఎయిర్‌లైన్స్ కేఎల్ఎం కూడా గత వారమే కీవ్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది. దీంతో రెండు సంస్థలు ఉక్రెయిన్ సంక్షోభంతో ముందు జాగ్రత్త పడ్డాయి.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
ఇదిలా వుండగా.. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్ దళాల మధ్య ఘర్షణలు పెరిగాయి. అయితే ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునివ్వడం గమనార్హం. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్‌లో తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!