హ్యాకర్స్ అదును చూసి సోషల్ మీడియా ఖాతాలపై దాడులు చేస్తూనే ఉన్నారు.. ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలకు సంబంధించిన సోషల్ మీడియాల ఖాతాలను హ్యాక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ.. మరికొందరు కేంద్ర మంత్రుల ఖాతాలు.. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ అయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు.. ఇవాళ సమాచార…
భారత్‌కు యువతే బలం.. ఈ ఏడాది వారికి చాలా కీలకం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. పుదుచ్చేరిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్‌లో ఎంస్ఎంఈ పాత్ర చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు.. ఇక, ప్రపంచాన్ని మార్చే సాంకేతికతను ఎంఎస్ఎంఈ రంగంలో ఉపయోగించడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఆ దిశగా కీలక ముందడుగు వేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.. ఇక, జాతీయ…
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు కేసుల సంఖ్య 15.8 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, దేశంలో పాజిటివిటీ రేటు పది శాతం దాటిపోయింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 442 మంది మృతి చెందగా, 60,405 మంది కోలుకున్నట్టు కేంద్ర…
ఇటీవల కాలంలో దేశంలో ఐవీఎఫ్ విధానం బాగా పాపులర్ అయింది. పిల్లలు లేనివారు ఈ పద్దతి ద్వారా పిల్లను కంటున్నారు. అండాలను, శుక్రకణాలను సేకరించి ప్రత్యేక పద్దతితో ల్యాబ్‌లో ఫలదీకరణం చేసి ఆ తరువాత అ అండాన్ని వేరొకరి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అక్కడ అండం పిండంగా మారుతుంది. ఇప్పుడు ఈ కృత్రిమ పద్దతి విధానాన్ని అరుదైన జంతువుల జాతిని పెంచేందుకు కూడా వినియోగిస్తున్నారు. దేశంలో అత్యంత అరుదైన జాతికి చెందిన పశువుల్లో పుంగనూరు జాతి ఆవులు కూడా…
దేశంపై మరోసారి కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు చెప్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం… దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలకు, వాస్తవ లెక్కలకు వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు ఐదు లక్షలు ఉంటే… వాస్తవానికి దీని కంటే 6-7 రెట్లు అధికంగా ఉండొచ్చని…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు లక్ష దాటిపోతున్నాయి. తాజాగా దేశంలో 1,68,063 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 8,21,446 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు 152 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6.4 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ తో…
పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు…
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండడం భారత్‌కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్‌కు సిరాజ్ దూరం అయ్యాడు.. సిరాజ్…
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అస్థిరంగా ఉందని…. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో కేవలం…
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి విపరీతంగా పెరుగుతోంది. కరోనా వల్ల సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలుసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని రాజ్‌నాథ్…