భారత్‌లో ఒమిక్రాన్ ఎంట్రీతో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైంది.. భారీగా స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. వరుసగా మూడో రోజు కూడా 3 లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదు అయ్యాయి.. కానీ, నిన్నటి తో పోలిస్తే.. ఇవాళ 9,550 కేసులు తగ్గిపోయినా.. భారీగానే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 19 లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 3,37,704 మందికి…
భారతదేశ ఇంధన భద్రతకోసం దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడారు. పెట్రోకెమికల్ రంగంలో పరిశోధన, అభివృద్ధి(ఆర్&డీ)కి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోలియం రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి మరింత కృషి జరగాలని దానికి ప్రభుత్వాలు కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. Read Also: కేంద్రం మీద నెపం నెట్టి.. గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: రాములునాయక్ పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల…
పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ మరోసారి బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ కేటగిరిలో వెంకటేష్ అయ్యర్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చినా రెండో వన్డేలో కూడా అతడికే తుది జట్టులో స్థానం కల్పించింది. తొలి వన్డేలో ఓడిన భారత్ రెండో వన్డేలో కూడా ఓడితే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయాల్సి ఉంది. జట్ల వివరాలుభారత్:…
కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్ని ఆంక్షలు విధించినా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారంతో పోలిస్తే దాదాపు 30వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 703 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,66, 027కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,88,396కి…
డయాబెటిస్ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లుగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఔషధం ఇకపై నోటి మాత్ర రూపంలో లభ్యం కానుంది. ప్రపంచంలోనే ఇది తొలి, ఏకైక ఓరల్ సెమాగ్లూటైడ్ కావడం గమనార్హం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని నోవోనార్డిస్క్ సంస్థ పేర్కొంది. Read Also: కరోనా ఎఫెక్ట్…
అరుణాచల్ ప్రదేశలోని సాంగ్పో నది వద్ద ఔషద మూలికలు సేకరించేందుకు వెళ్లిన 17 ఏళ్ల యువకుడిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింది. అతనితో పాటు మరో వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా జానీ యుయాంగ్ తప్పించుకోగా మిరాయ్ తరోన్‌ను అపహరించుకుపోయారు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. అయితే, భారత ఆర్మీ మిస్సింగ్ కేసుగా దీనిని డీల్ చేస్తున్నారు. మరోవైపు చైనా అధికారులతో భారత్ హాట్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నది. ఈ కిడ్నాప్‌కు…
1850 దశకంలో రైళ్లు దేశంలో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల గురించి మనందరికీ తెలుసు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్ల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. రైళ్లలో గేర్లు ఉంటాయనే సంగతి చాలా మందికి తెలియదు. రైళ్లలో చాలా గేర్లు ఉంటాయి. ఈ గేర్లను నాచ్ అని అంటారు. ఇంజన్లో మొత్తం 8 నాచ్‌లు ఉంటాయి. ఎనిమిదో నాచ్‌లో సుమారు 100 కిమీ వేగంతో ప్రయాణం…
దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. థర్డ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కరోనా కేసులు నమోదవ్వగా, గడిచిన 24 గంటల్లో 491 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,23,990 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 19,24,051 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.41శాతంగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం…