Covid Ending : జలుబు. జ్వరం.. కోవిడ్.. ఇక మనతోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండేళ్ళకు పైగా ప్రపంచాన్ని వణికించింది చిన్న వైరస్. గతంలో ఎన్నడూ లేని విధంగా మృత్యుఘంటికలు మోగించిన కోవిడ్ కథ ముగిసిందా. ఈ వైరస్ అప్పుడే అంతం కాలేదని స్పష్టం చేసింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కరోనా తగ్గింది కదా అని ఏమాత్రం లైట్ తీస్కోవద్దని హెచ్చరించింది. కరోనా శాశ్వతంగా ఇకపై మనతోనే ఉండనుందా? ప్రపంచం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది లాన్సెట్ మెడికల్ జర్నల్. కరోనా కథ ముగిసిందని.. మహమ్మారి ఎండెమిక్‌గా మారినట్టు తెలిపింది. అయితే వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుందని.. సీజనల్ ఫ్లూ లాగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎక్కువ మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి ఏర్పడినట్టు అంచనా వేసింది లాన్సెట్.
కరోనా అంటు వ్యాధి కాబట్టి.. అది దాని శక్తిని కోల్పోయినా.. సీజనల్ వ్యాధుల రూపంలో మనతోనే ఉంటుందని పేర్కొంది. రుతువులు మారే క్రమంలో వచ్చే సాధారణ జలుబు, జ్వరం రూపంలో.. కొవిడ్ కొనసాగుతుందని తెలిపింది. సాధారణ అంటు వ్యాధిలా ఉంటుంది కాబట్టి.. దాని వల్ల తీవ్ర అనారోగ్యం ఉండకపోవచ్చంది లాన్సెట్. అయినా.. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే అని.. అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందే అని సూచించింది.
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
లాన్సెట్ చెప్పినట్టు వైరస్ బలహీన పడి సాధారణ ఫ్లూగా మారుతుందా? లేక మరికొన్ని బలమైన వేరియంట్లు పుట్టుకొచ్చి.. కొవిడ్ తీవ్రత ఇంకా పెరుగుతుందా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. గతంలో కొంత మంది వైద్య నిపుణులు… మూడో వేవ్ ఉండకపోవచ్చని చెప్పిన సందర్భాలు చూశాం. కానీ థర్డ్‌వేవ్ పంజా విసిరింది. మరో దశలో కూడా వైరస్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడుతుందేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!