పట్నం నుంచి పల్లె వరకు.. సిటీ నుంచి మారు మూల గ్రామం వరకు.. అన్ని ప్రాంతాలను టచ్ చేస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. దీనికి చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది.. మొదట స్వదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం.. 2021 జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లు ఎగుమతి చేసింది.. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు…
సఫారీ గడ్డపై టీమిండియా మరోసారి నిరాశపరిచింది. రెండో టెస్టు మాదిరిగానే మూడో టెస్టులోనూ భారత్ ఓటమి పాలయ్యింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 212 పరుగుల విజయలక్ష్యాన్ని నాలుగో రోజు లంచ్ ముగిసిన వెంటనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. Read Also: బిగ్ బ్రేకింగ్: ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి…
ఉత్తర ప్రదేశ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అధికారులు శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. Read Also: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు…
భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్‌గా పంజా విసురుతోంది.. దీంతో.. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది… రోజుకో రికార్డు తరహాలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ కలవరపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 315 మరణాలు నమోదు, ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073కు చేరింది..…
మహా నగరం హైదరాబాద్ విస్తరిస్తూనే ఉంది… ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భారీ స్థాయిలో కొత్త వెంచర్లు వస్తూనే ఉన్నాయి.. ప్లాట్లు, ఇళ్లు ఇలా రెగ్యులర్‌గా క్రయ విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.. ప్రతిష్టాత్మక సంస్థలు రంగంలోకి దిగి విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు.. ఇలా అనేక రకాలుగా బిజినెస్ చేస్తున్నాయి.. కొన్ని చోట్ల ఇప్పటికే ఓఆర్ఆర్ను దాటేసి రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది… రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుండడంతో.. దానిని దృష్టిలో పెట్టుకుని కూడా బిజినెస్…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోడీ ఈరోజు దేశంలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా హాజరయ్యారు. దేశంలో థర్డ్ వేవ్ దృష్ట్రా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చిస్తున్నారు. వ్యాక్సినేషన్ పైకూడా ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. అయితే, ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఆయన…
ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఎన్నో కార్ల కంపెనీలు ఇండియాలో ప్లాంట్లను ఏర్పాటు చేసి కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే కార్ల నుంచి, ప్రీమియం బ్రాండ్ కార్ల వరకు ఇండియాలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఇండియాలో నెలకొల్పేందుకు సిద్దం అవుతున్నాయి. అయితే, ఎలన్ మస్క్ కు చెందని టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఎప్పటి నుంచో…
ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. కరోనా నేపథ్యంలో ఈ పొట్టి ఫార్మాట్‌ను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది.. ఇక, స్వదేశంలోనూ మ్యాచ్‌లు జరిగే పరిస్థితి లేదు.. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాల్సిందే.. అయితే, ఐపీఎల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఈ ఐపీఎల్…
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. ఇక, బూస్టర్ డోసును కూడా ప్రారంభించింది.. మొదటగా ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు.. 60 ఏల్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఇదే సమయంలో.. అసలు బూస్టర్ డోసు ప్రభావం ఎంత? అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ల ప్రభావంపై దేశీయంగా అధ్యయనం జరగకపోయినా,…
భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఓవైపు నివారణ చర్యలను పూనుకుంటూనే.. మరోవైపు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండగా.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి సిద్ధం అయ్యారు…