త్వరలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టబోతున్న రెండు కొత్త ఫ్రాంచైజీలపై అందరి దృష్టి నెలకొని ఉంది. అయితే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ జట్టుతో ఉంటాడో అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై కోహ్లీ స్పందించాడు. తనను వేలంలో పాల్గొనమని చాలా ఫ్రాంచైజీలు కోరుతున్నాయని.. కానీ తాను మాత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తోనే ఉంటానని కోహ్లీ స్పష్టం చేశాడు. 8 సంవత్సరాల పాటు ఆర్సీబీకి సారథ్యం…
భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.. దానికి అనుగుణంగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.. జనవరి మధ్యలో అత్యధిక కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు క్రమంగా మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి.. నిన్న 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తే.. ఇవాళ ఆ సంఖ్య 70 వేల దిగువకు పడిపోయింది.. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల…
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీని ఐసీసీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో మరోసారి రుజువైంది. అక్టోబర్ 23న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు అలా మొదలయ్యాయో లేదో.. గంటల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. Read Also: యువ సంచలనం యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించిన ఐసీసీ తమ…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మిషన్ 2024 లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్జీత్కౌర్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రామికవర్గం, ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే…
దేశంలో ఎక్కువ కార్లను తయారు చేసే కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. ప్రపంచలో హ్యుందాయ్ కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్. ఇండియాలో అనేక ప్రాంతాల్లో ఈ కంపెనీ తన ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ తయారయ్యే కార్లకు ప్రపంచంలో డిమాండ్ అధికంగా ఉంటున్నది. అయితే, హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాయ్‌కాట్ హ్యుందాయ్ పేరుతో ట్రెండ్ అయింది. పాకిస్తాన్లో హ్యుందాయ్ కంపెనీ అధికారిక ఖాతా ట్విట్టర్లో కాశ్మీర్‌పై ఓ…
రైల్వేశాఖ సరికొత్త ఐడియా ఆ శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నది. 150 సంత్సరాలుగా దేశంలో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. నిరంతరం వేల కిలోమీటర్ల మేర రైళ్లు పరుగులు తీస్తున్నాయి. దేశంలో 50 సంత్సరాల నుంచి సేవలు అందిస్తున్న రైల్వే పెట్టెలు అనేకం ఉన్నాయి. అవి ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్నింటిని మ్యానేజ్ చేసి ఏదోలా నడిపిస్తున్నారు. ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న రైల్వే కోచ్‌లు అనేకం ఉన్నాయి. వీటిని అలాగే వదిలేస్తే తుప్పుపట్టిపోతాయి. వీటిని ఎలాగైనా వినియోగించుకోవాలని…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేశారు. చేస్తూనే ఉన్నాయి. టూవీలర్స్‌తో పాటు, కార్లను కూడా ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. వాహనాల వినియోగం పెరగడంతో వీటికి డిమాండ్ కూడా పెరిగింది. దేశంలో మరో ఏఎంఓ ఎలక్ట్రిక్ స్కూటర్ జన్నీ ప్లస్ వాహనాన్ని లాంచ్ చేసింది. 60 వీ 40 ఎహెచ్ బ్యాటరీతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. క్రూయిజ్…
ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ తర్వాత థర్డ్ వేవ్ రూపంలో భారత్‌పై విరుచుకుపడింది కరోనా మహమ్మారి.. అయితే, ఇప్పుడు మళ్లీ భారీగా కేసులు తగ్గుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83, 876 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒకేరోజు 11,56,363 శాంపిల్స్ పరీక్షించగా.. 83,876 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 895 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. మరోవైపు ఇదే సమయంలో 1,99,…
కరోనా కట్టడి కోసం దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. రెండు డోసుల వ్యాక్సిన్ల తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోసును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.. స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సింగిల్ డోసు టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు…