India: షింజో అబే హత్యకు భారత్ సంతాపం.. జాతీయ జెండా అవనతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ఇవాళ సంతాపం తెలపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి నివాళిగా శనివారం దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలపై జాతీయ జెండాలను సగం వరకు కిందకు దించారు. అబే మృతికి నివాళిగా భారత్‌లో శనివారం రోజు సంతాపం దినం పాటించనున్నట్లు శుక్రవారం ట్విటర్ వేదికగా మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అబే మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ సంతాపం తెలిపారు. జపాన్ కోసం అబే తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. 2021లో కేంద్ర ప్రభుత్వం అబెకు భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. భారత్‌లో ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు రావటంలో షింజో అబే కీలక పాత్ర పోషించారు. జపాన్ సాంకేతికతతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ, అబె కలిసే శంకుస్థాపన చేశారు. ‘మై ఫ్రెండ్, అబే సాన్’ అనే శీర్షికతో ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రధాని మోడీ ఇలా రాశారు. “అబే మరణంతో, జపాన్, ప్రపంచం ఒక గొప్ప దూరదృష్టిని కోల్పోయింది. నేను ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను” అని రాసుకొచ్చారు.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
Tamarind seeds: కాసులు కురిపిస్తున్న చింతగింజలు..అక్కడ భలే ఉపాధి
శుక్రవారం పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో అబేపై కాల్పులు జరిగాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. “కార్డియోపల్మోనరీ అరెస్ట్” పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అబే ప్రాణాలు విడిచినట్లు సాయంత్రం 5:03 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) వైద్యులు అధికారికంగా వెల్లడించారు. స్థానిక మీడియా ప్రకారం, నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి అనే అనుమానితుడిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అతను 2006-07, 2012-20 వరకు రెండుసార్లు జపాన్ ప్రధానిగా ఉన్నారు. అతని తరువాత యోషిహిడే సుగా, ఫ్యూమియో కిషిడా అధికారంలోకి వచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!