ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు నివశిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్తుంటారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే దానిపై భారత విదేశాంగ సహాయమంత్రి వీ మురళీధరన్ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భారతీయులు ఖైదీలుగా ఉండగా, సౌదీ అరేబియాలో 1363…
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఏపీ పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని దహనం చేయనున్నారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో విస్తృతంగా గంజాయి తోటలను ధ్వంసం చేసి.. గంజాయి సాగుపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. అనేక దశాబ్దాలుగా ఏవోబీతో పాటు గిరిజన గ్రామాలలో కొనసాగుతున్న గంజాయి సాగుపై గతంలో…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. అయితే కరోనా మరణాలు మాత్రం నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 804 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి పెరిగింది. అటు…
వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ జట్టును వైట్‌వాష్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇక, టీ-20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది.. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి భారత్-వెస్టిండీస్ జట్లు.. అయితే, టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పొట్టి పార్మాట్ సిరీస్‌కు దూరమయ్యారు.. వారి ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలను జట్టులోకి వచ్చినట్టు బీసీసీఐ…
సొంత గడ్డపై వన్డేసిరీస్‌ను క్లీన్‌స్విప్ చేసింది టీమిండియా… ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన… ఇవాళ జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లోనూ ఘన విజయాన్ని నమోదు చేసింది.. 96 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.. దీంతో వెస్టిండీస్‌పై 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 265 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది… విండీస్ ముందు 266 పరుగుల టార్గెట్‌ను పెట్టింది.. అయితే,…
దేశవ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. ఉదయం 11:30 గంటల నుంచి బ్రాడ్‌బ్యాండ్, వైఫై, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు ఎయిర్టెల్ యాప్ కూడా పనిచేయట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ట్విట్టర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అటు ఎయిర్టెల్ సేవల అంతరాయంపై కంపెనీ స్పందించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. తమ కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పింది. సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. కాగా ఎయిర్టెల్…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ప్రతిరోజూ లక్షల్లో నమోదైన కేసులు ప్రస్తుతం 60వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,077 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,36,137కి చేరింది. తాజాగా కరోనా వల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,07,177కి పెరిగింది అటు తాజాగా దేశవ్యాప్తంగా…
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన PM కేర్స్ నిధి కార్యక్రమం ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైంది. విరాళాల రూపం వచ్చిన మొత్తంలో సగం కూడా ఖర్చు చేయడం లేదు. అంతేకాదు… PM కేర్స్ కింద కొనుగోలు చేసిన మేడిన్ ఇండియా వెంటిలేటర్లు గొడ్లకు పరిమితం కావడం విమర్శలకు దారితీస్తోంది. కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు PM కేర్స్ ఫండ్‌ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని రకాల అత్యవసర వైద్యలు అందించేందుకు నిధులు…
సాధారణంగా వంతెనలు అంటే సిమెంట్, లేదా స్టీల్‌తో నిర్మిస్తుంటారు. రోడ్డును దాటేంగుకు పాదచారుల కోసం చాలా ప్రాంతాల్లో ఐరన్, స్టీల్‌తో నిర్మించిన వంతెనలు కనిపిస్తుంటాయి. వాహనాలు ప్రయాణం చేసేందుకు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తున్నారు. ఇవి అన్ని చోట్ల ఉండేవే. కానీ, కొన్ని వంతెనలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. అలాంటివే గ్లాస్ వంతెనలు. వంతెనలను గ్లాస్‌తో నిర్మిస్తారు. ఇలాంటివి దేశంలో రెండు ఉన్నాయి. అందులో ఒకటి సిక్కింలో ఉన్నది. సిక్కింలోని పెల్లింగ్ నగరంలో ఈ గ్లాస్…
క్రిఫ్టోకరెన్సీ విషయంలో ఆర్బీఐ నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు క్రిఫ్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వానికి పెనుముప్పు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. క్రిఫ్టోకరెన్సీల వంటి ప్రైవేటు కరెన్సీలకు ఎలాంటి విలువ ఉండదని, కనీసం తులిప్ పువ్వు విలువ కూడా చేయవని అన్నారు. మదుపర్లు వారి సొంత పూచీకత్తుపైనే పెట్టుబడులు పెడుతుంటారని, క్రిఫ్టోకరెన్సీల గురించి హెచ్చరించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి క్రిఫ్టోకరెన్సీలు పెనుముప్పుగా మారతాయని శక్తికాంత్…