దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,54,778 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 18,840 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 43 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 16,104 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,25,028గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతంగా నమోదైంది
రోజువారీ కేసుల సంఖ్య శుక్రవారంతో పోలిస్తే కాస్త పెరిగాయి. ఇందులో 4,29,53,980 మంది కోలుకోగా.. 5,25,386 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 98.51 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.29 శాతంగా ఉంది.
Vaccine: 12 ఏళ్లలోపు పిల్లలకు కొవాగ్జిన్, కొర్బెవ్యాక్స్ వినియోగానికి సిఫార్సు
ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా చాలా వరకు కేసులను, మరణాలను అడ్డుకోగలుగుతున్నాం. ఇప్పటికే దాదాపుగా 80 శాతం ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 1,98,65,36,288 డోసులను అర్హులైన ప్రజలకు అందించారు. గడిచిన 24 గంటల్లో 12,26,795 మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్ల 65లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రపంచదేశాల్లో కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 7,91,063 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,463 మంది మహమ్మారితో ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 55,95,71,183కు చేరింది.