డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. భారత్ ను కవ్వించే ప్రయత్నం చేసింది. తూర్పు లడఖ్ సెక్టార్ లో ఘర్షణ ప్రాంతం సమీపంలోకి చైనా యుద్ధవిమానం వచ్చింది. ఈ ఘటన గత నెల చివరి వారంలో జరిగింది. జూన్ చివరి వారంలో ఒక రోజు సాయంత్రం 4 గంటలకు చైనా యుద్ధవిమానం వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా భారత భూభాగానికి దగ్గర వచ్చిందని తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తం అయిన భారత సైన్యం వెంటనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం అలెర్ట్ అయింది.
సమాచారం ప్రకారం భారత సరిహద్దు వెంబడి లడఖ్ ప్రాంతానికి అనుకుని చైనా తన ఫైటర్ జెట్లను, ఎస్-400 తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించి మిలిటరీ డ్రిల్స్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం తూర్పు లడఖ్ సరిహద్దు వెంబడి చైనా తన సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరిస్తోంది. పీఎల్ఏ తన యుద్ధవిమానాలను, డ్రోన్లను హోటన్, గుర్ గున్సా ఎయిర్ బేసుల్లో మోహరించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ రెండు ఎయిర్ బేసులను చైనా చాలా డెవలప్ చేసింది. 2020 నుంచి చైనా తన సైన్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా దళాల్ని వేగంగా తరలించేందుకు రహదారులు, వంతెనలను నిర్మిస్తోంది.
Read Also: Viral Video: కత్తితో పాఠశాలకు వెళ్లి టీచర్‌ను చంపేస్తానంటూ వ్యక్తి హల్‌చల్..
మే 2020 గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల సైన్యం ముఖాముఖిగా నిలబడ్డాయి. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. చైనా దుందుడుకు చర్యలకు ధీటుగా ఇండియా కూడా సరిహద్దుల్లో సైన్యం మోహరింపును పెంచింది. నార్నర్న్ కమాండ్ చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే సరిహద్దు వెంబడి భారత్, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థను సిద్ధం చేసింది.