దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,79,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 18,815 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 38 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 15,899 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,335గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైంది
రోజువారీ కేసుల సంఖ్య గురువారంతో పోలిస్తే 100కు పైగా కేసులు తగ్గాయి. ఇందులో 4,29,37,876 మంది కోలుకోగా.. 5,25,343 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 98.52 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27 శాతంగా ఉంది.
Big Breaking: దుండగుల కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుర్మరణం
ఇండియాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా చాలా వరకు కేసులను, మరణాలను అడ్డుకోగలుగుతున్నాం. ఇప్పటికే దాదాపుగా 80 శాతం ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 1,98,51,77,962 డోసులను అర్హులైన ప్రజలకు అందించారు. గడిచిన 24 గంటల్లో 17,62,441 మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు కేంద్రం వెల్లడించింది.