దేశంలో ఆందోళన రేకెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయింది. బుధవారం కాస్త పెరిగిన కరోనా కేసులు గురువారం స్వల్పంగా తగ్గాయి. బుధవారం 71,365 కేసులు నమోదు కాగా గురువారం కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,241 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 5,06,520గా ఉంది.…
గత కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్ రేట్లు మరోసారి భారీగా పెరుగుతాయని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్పీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ధరలు…
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్లో టీమిండియా చేసిన ప్రయోగాలపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌కు పంపించి… వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపడం సరికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు చాలా మంది ఓపెనర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పంత్‌ను ఓపెనింగ్‌కు పంపించి ప్రయోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. రోహిత్‌తో పంత్‌ను ఓపెనింగ్ పంపడం చివరి ఆప్షన్‌గానే…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న రెండో వన్డేలోనూ భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి.. 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 238 పరుగుల ఛేదనలో, వెస్టిండీస్ జట్టు విఫలం అయ్యింది… టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసి.. విండీస్‌కు ముందు 238 పరుగుల…
కరోనా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో కార్యకలాపాలు నిలిచిపోయాయి.సైంటిస్టులు, ఇతర ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. ఈ ఏడాది 19 ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 8 రాకెట్లు, 7 అంతరిక్ష నౌకలు , 4 టెక్నాలజీ డెమానేషన్ ప్రయోగాలు ఉన్నాయి. వీటిల్లో చంద్రయాన్ -3 కూడా ఉంది. ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగం ( పీఎస్ఎల్వీ…
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.. రెండో వన్డేలో టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.. అయితే.. ఈ మ్యాచ్‌లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లో టాప్‌స్కోరర్ కూడా అతడే.. ఇక, 83 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేసిన సూర్యకుమార్.. వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకీ సూర్యకుమార్ సృష్టించినా ఆ ప్రపంచ రికార్డు విషయానికి వస్తే……
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సత్తా చాటిన టీమిండియా… రెండో వన్డేలో కాస్త చిన్న టార్గెట్‌నే ప్రత్యర్థి జట్టుముందు ఉంచింది.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.. సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో.. కేఎల్ రాహుల్ 49 పరుగులతో రాణించారు.. రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రారంభించడంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కెమర్ రోచ్ 5 పరుగుల వద్ద…
ఒక్కో ఏడాది లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకుంటున్నారు.. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కొందరు తగిన ఉద్యోగం దొరకపోయినా.. ఎక్కడో తోచిన పని చేసుకుంటున్నారు.. కొందరికి అది కూడా సాధ్యం కావడం లేదు.. ఇక, నిరుద్యోగం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అన్ని పార్టీలు.. మేం అధికారంలోకి వస్తే.. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామిని హామీలు ఇవ్వడం మామూలే.. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చిన…
టెలికం సంస్థల మధ్య అమాంతం తగ్గిపోయిన మొబైల్ టారిఫ్ ధరలు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. గత ఏడాది చివర్లో దాదాపు అన్ని ప్రధాన టెలికం సంస్థలు అన్నీ టారిఫ్ ధరలు పెంచేసి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.. కానీ, మరోసారి తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పేందుకు ప్రముఖ టెలికం సంస్థల భారీ ఎయిర్టెల్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది.. గత ఏడాదిలో మొబైల్ టారిఫ్ ధరల పెంపుతో భారతీ ఎయిర్‌టెల్‌కు మూడో త్రైమాసికంలో కలిసివచ్చింది.. మరోవైపు.. ఎయిర్‌టెల్‌లో…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి తొలివారంలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 67, 597 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం 71,365 కేసులు వెలుగుచూశాయి. అంటే నిన్నటితో పోలిస్తే 4వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976కి…