చైనా వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపించింది. దేశాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఇప్పటికీ ఏదో రూపంలో కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతూనే ఉంది. తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఓమిక్రాన్ ఎక్స్ఈ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కరోనా కేసుల…
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్…
అగ్గిపుల్లతో పొయ్యి వెలిగించుకోవచ్చు…ఇల్లూ తగలబెట్టుకోవచ్చు. అది అగ్గిపుల్ల తప్పుకాదు. ఉపయోగించేవారి విచక్షణ మీద ఆధారపడివుంటుంది. అదేవిధంగా, సాంకేతిక ప్రగతి కూడా అంతే. స్మార్ట్ ఫోన్లను టెక్నాలజీకి ఉపయోగిస్తే మంచిది. అదే మోసాలకు ఉపయోగిస్తే సమాజానికి చేటు జరుగుతుంది. దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకంలో మహిళలు ముందంజలో వున్నారంటే నమ్ముతారా? ఎస్ ముమ్మాటికి ఇది నిజమే. స్మార్ట ఫోన్ వాడకంలో ఓ రేంజ్ లో దూసుకు పోతున్నారు మన భారత దేశ మగువలు. ఇంటి పని, వంటపని ఏమో…
దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 3,207 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా 29 మంది చనిపోయారు. మరో 3410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,31,05,401గా నమోదయ్యాయి. మొత్తం మరణాలు 5,24,093గా నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 20,403గా…
అమ్మ..! ఆ.. పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ…
ఉత్సాహం ఉండాలి, కానీ అత్యుత్సాహం ఉండకూడదు. ఏం కాదులే అని ఆ అత్యుత్సాహాన్ని ఎక్కడిపడితే అక్కడ ప్రదర్శిస్తే మాత్రం.. బాక్స్ బద్దలవ్వడం ఖాయం! ఇప్పుడు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోయ్ విషయంలోనూ అదే జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారతదేశానికి సలహా ఇవ్వబోయి, గట్టి ఎదురుదెబ్బని ఎదుర్కొన్నాయన! దీంతో, మరో దారి లేక ఆయన వెంటనే వెనకడుగు వేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ…
అప్పుడప్పుడు రోడ్లపై కరెన్సీ నోట్లు పడిపోవడం మనం చూశాం. కానీ నదిలోంచి కరెన్సీ కట్టలు కొట్టుకువస్తే ఎలా వుంటుంది. అలాంటి అనుభవమే ఎదురైంది రాజస్థాన్ అజ్మేర్లోని పోలీసులకు. ఆనాసాగర్ సరస్సులో 2వేల రూపాయల కరెన్సీ నోట్ట కట్టలు తేలియాడుతూ రావడంతో పోలీసులు షాకయ్యారు. ఈ నోట్లు కూడా పాలిథీన్ బ్యాగులో ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంచిలో మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉన్నాయని, అన్నీ రూ.2వేల నోట్లే అని అధికారులు తెలిపారు.…
ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం అంతా ఇంత కాదు.. వైరస్ సృష్టించిన విలయానికి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం. అయితే ప్రస్తుతం చోటుచేసుకుంటోన్న వాతావరణ మార్పులు తదుపరి వైరస్కి కారణమవుతన్నాయని తాజా అధ్యయనం అంచనా వేసింది. విపరీతంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి తరలి రావడం, దాంతో వైరస్లు జంతువుల నుంచి మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును పెంచుతున్నట్లు నివేదికలో వెల్లడైంది. Read Also: Honour Killing: పరువు హత్యపై ఒవైసీ రియాక్షన్ జంతువులను ఒకేచోట…
వంటింట్లో గ్యాస్ ధర మంట పెడుతోంది… ఇప్పటికే ఆన్టైం హై రికార్డులను తాకిన ఎల్పీజీ సిలిండర్ ధర.. మరోసారి పెరిగింది.. వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచేశారు.. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిలిండర్ ధరల పెంపు సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. తాజా పెంపుతో.. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి చేరింది. Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్.. మళ్లీ తగ్గిన…
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్తో రాజస్థాన్ ఢీ, రాత్రి 7.30 గంటలకు లక్నోతో కోల్కతా మ్యాచ్ * హైదరాబాద్లో నేడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన, ఉదయం 10 గంటలకు ఉద్యమకారులతో రాహుల్ సమావేశం, దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించనున్న రాహుల్, చంచల్గూడ జైలులో ఎన్ఎస్యూఐ నేతలను కలవనున్న రాహుల్ గాంధీ * ఏపీలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు కేంద్ర బృందం పర్యటన, నేడు కడప జిల్లాలో భూములు పరిశీలించనున్న…