అంతర్జాతీయ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్లో అధికారిక దేశం హోదా కల్పించారు. దీంతో ఇండియాకు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యింది. కాగా…
యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. తొలిరోజు జర్మనీలో పర్యటించిన ఆయన.. రెండో రోజున అక్కడి నుంచి కోపెన్హాగన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడ మోడీకి డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్సన్ స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరూ కలిసి డెన్మార్క్ ప్రధాని అధికారిక నివాసం మానియన్ బోర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఫ్రెడరిక్సన్.. తన నివాసం మొత్తాన్ని మోడీకి చూపించారు. భారత పర్యటనకు వచ్చినప్పుడు.. తనకు మోడీ గిఫ్ట్‌గా ఇచ్చిన పెయింటింగ్‌ను కూడా…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోయి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్న వారికి రాబోయే రోజుల్లో పెద్ద షాక్ తప్పకపోవచ్చు. వచ్చే ఆరు నెలల్లో ప్రపంచాన్ని చమురు ధరలు కమ్మేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు దాటవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది శరాఘాతం వంటిది. వాటిని ఆర్థిక సంక్షోభంలో పడేస్తుంది. చమురు ధరల భారాన్ని మోసే శక్తి చాలా దేశాలకు లేదు. అయితే రెండు దేశాలకు మాత్రం ఆ బాధ లేదు.…
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవో మే 4 నుంచే ప్రారంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా ఎల్ఐసీ ప్రవేశించనుంది. ఈ మేరకు ఎల్ఐసీ ఒక్కో ఈక్విటీ షేర్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.902 నుంచి 949గా నిర్ణయించింది. అయితే పాలసీదారుల కోసం ఎల్ఐసీ ఐపీవోలోని ప్రతి షేరుపై రూ.60 తగ్గింపును కల్పించనున్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రిటైల్‌తో పాటు ఇతర పార్టిసిపెంట్ల కోసం మే 4 నుంచి మే…
కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది.. భారత్‌లో మరి కొత్త వేరియంట్ కేసు నమోదు అయ్యింది.. కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్‌కు సంబంధించిన తొలి కేసు భారత్‌లో వెలుగుచూసినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్(ఐఎన్ఎస్ఏసీవోజీ), సార్స్ సీవోవీ2 వైరస్‌కు చెందిన బులిటెన్‌ను విడుదల చేసింది.. అయితే, భారత్‌లో నమోదైన తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు ఎక్కడ వెలుగు చూసింది అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక, గత వారంతో పోలిస్తే, 12…
నిరుద్యోగిత రేటు మరింతపైకి కదిలింది.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన నివేదిక నిరుద్యోగిత పెరిగినట్టు స్పష్టం చేసింది.. ఈ ఏడాది మార్చిలో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. తర్వాత నెలలలో మరింత పైకి కదిలి.. ఏప్రిల్‌లో 7.83 శాతంగా నమోదైంది. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పరిశీలిస్తే మాత్రం భిన్నంగా ఉంది.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చి నెలలో 8.28 శాతం ఉంటే.. ఏప్రిల్ నెలలో అది…
శ్రీలంకను సంక్షోభం కుదిపేస్తోంది. రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య దేశ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు శ్రీలంక మాజీ అధ్యక్షుడు, శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్వహించిన మేడే ర్యాలీలో ఆయన కీలక ప్రకటన చేశారు. దేశంలో కొత్తగా ఎన్నికలు జరపాలన్నారు. ఎన్నికలే సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. మనుగడకు పోరాటం చేస్తున్న ప్రజల్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి. రాజకీయ నాయకులు ప్రజల…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్లో వున్నారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… జర్మనీకి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం 9.42 గంటలకు జర్మనీలో దిగారు. ఆ దేశ ఉన్నతాధికారులు మోదీకి ఘనస్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్‌తో మోదీ భేటీ కానున్నారు. ఈ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చించనున్నారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారంతో పోలిస్తే సోమవారం స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 3,157 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,82,345కి చేరింది. అటు కరోనా కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. కరోనా బారి నుండి 2,723 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,38,976గా…