దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,927 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం 2,483 కేసులు నమోదు కాగా బుధవారం కేసుల సంఖ్య 2,927కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,65,496కి చేరింది. మరోవైపు కొత్తగా 32 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 2,252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,25,25,563 మంది కరోనా…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. దేశంలో ఇప్పటివరకు 86 శాతం మంది పెద్దలకు రెండు డోసుల టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ వెల్లడించారు. అలాగే చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. 6 నుంచి 12 ఏళ్ల వారికి కొవాగ్జిన్, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్, 12 ఏళ్లు పైబడిన వారికి జై కోవ్ డీ వ్యాక్సిన్…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లు బ్లాక్ చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. వీటిలో 10 భారతీయ వార్తా ఛానెళ్లు ఉండగా.. 6 పాకిస్థాన్ ఆధారిత యూట్యూబ్ వార్తా ఛానెళ్లు ఉన్నట్టు ప్రకటించింది.. భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు చర్యలు తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. భారతదేశంలో భయాందోళనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని ప్రేరేపించడానికి పబ్లిక్…
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 11 వారాల పాటు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తర్వాత మూడు వారాలుగా కేసులు క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 2,541 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనాతో మరో 30 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 16,522గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు…
దేశంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా శృంగారం చేస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందితో శృంగారం చేసే విషయంలో చాలా మంది కండోమ్ లేకుండా ఈ కార్యంలో పాల్గొంటున్నారు. దీంతో హెచ్ఐవీ అనేది కామన్ డిసీజ్‌గా మారిపోయింది. దేశవ్యాప్తంగా అరక్షిత లైంగిక సంపర్కంతో గత పదేళ్లలో 17.08 లక్షల మంది హెచ్ఐవీ బారిన పడినట్లు తాజాగా ఎయిడ్స్ నివారణ సంస్థ వెల్లడించింది. ఎయిడ్స్ కేసులకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన…
జాతీయ పతాకానికి సంబంధించి పాకిస్థాన్ నెలకొల్పిన 18 ఏళ్ల రికార్డును భారత్ బద్దలుకొట్టింది. బీహార్ జగదీష్పూర్లో శనివారం నాడు సుమారు 77,900 మంది ప్రజలు ఒకేసారి భారత జాతీయ పతాకాలను చేతిలో పట్టుకుని గాలిలో ఊపుతూ రికార్డు సృష్టించారు. ఇది ఓ రికార్డు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని లెక్కించడానికి గిన్నిస్ రికార్డు సంస్థ ప్రత్యేకంగా కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్…
పాకిస్థాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. 1971 ఇండియా-పాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ అసోం వెటరన్స్ సన్మానసభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని హంతం చేయడంలో భారత దీటుగా వ్యవహరిస్తుందన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు చెప్పడంలో విజయవంతం అయ్యామన్నారు.. ఇక, ఉగ్రవాద చర్యలతో దేశ సరిహద్దులు దాటి వచ్చి భారత్‌ను టార్గెట్ చేస్తే.. మేం ఏ మాత్రం వెనక్కి తగ్గం.. తాము కూడా బోర్డర్ దాటడానికి వెనుకడుగు వేసేది లేదని…
హాలీవుడ్ హీరో విల్ స్మిత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో చోటుచేసుకున్న చెంపదెబ్బ ఘటనతో స్మిత్ ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడు. తన భార్యను కామెంట్ చేసిన యాంకర్ పై స్టేజిపైనే చేయి చేసుకున్న విల్ స్మిత్ ఈ ఘటన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఆస్కార్ అవార్డు వెనక్కి ఇవ్వాల్సిందిగా కమిటీ కోరినట్లు సమాచారం. ఇక ఇవన్నీ పక్కన పెడితే మూడేళ్ళ తరువాత విల్ స్మిత్…
కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు క్రమంగా అన్ని ఏజ్ గ్రూప్‌లకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. దశలవారీగా ఇప్పటికే 12 ఏళ్లు పైబడినవారి వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంమైంది.. 5-12 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై చర్చించింది.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు…
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా బోరిస్ జాన్సన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో బోరిస్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్- బ్రిటన్ మధ్య వాణిజ్య, ప్రజా సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశం…