గత మూడు రోజులుగా హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థపై ద్రుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా. యాభై ఏళ్ళ క్రితమే హార్వెస్ట్ ఇండియా సంస్థను స్థాపించారు. పేదలకు, అస్వస్థతతో ఉన్న వారికి, అనాధ పిల్లలకు సేవ చేయడమే ఈ సంస్థ లక్ష్యం. పదిహేను అత్యున్నత సేవా అవార్డులను అందుకున్నాంమన్నారు. నా భర్త కత్తెర సురేష్ కుమార్ అరెస్టు అంటూ వార్తలు రాశారు. నా భర్త విదేశాల్లో ఉన్నారు. మాపై కొందరు కావాలనే…
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. మే 14 నుంచి గోధుమల ఎగుమతులను తక్షణమే నిలపివేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే ఈ ఉత్తర్వుల కన్నా ముందు ఎగుమతుల కోసం అనుమతులు ఉంటే అనుమతించబడుతాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో…
భారత వ్యవసాయ రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ ( ఐఎండీ). భారత్ లో వర్షాలకు అత్యంత కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. భారత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా భావించే నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు ప్రారంభం అయినా.. మొదటి,…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య రాజధాని కీవ్ లో మూతపడిన భారత రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం కానుంది. రష్యా దాడి తీవ్రమవుతున్న సమయంలో భారత రాయబార కార్యాలయాన్ని మార్చి 13 పోలాండ్ లోని వార్సాకు తరలించారు. తాజాగా మే 17 నుంచి కీవ్ లో ఎంబసీని తెరవనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి పనిచేసేందుకు వివిధ పాశ్చాత్య దేశాలు సమాయత్తం అవుతున్న వేళ భారత్ కూడా తన ఎంబసీని ఉక్రెయిన్…
బుట్టబొమ్మ పూజా హెగ్డే అరుదైన గౌరవం అందుకుంది. చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం మన స్టార్ నటులకు చాలా తక్కువమందికి దక్కింది. ఇక ఈసారి మన బుట్టబొమ్మ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.…
దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది సీబీఐ.. ఒకేసారి 40 చోట్ల దాడులు నిర్వహించాయి సీబీఐ అధికారుల బృందాలు… ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.. ముఖ్యంగా విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో సోదాలు జరిగాయి.. 14 మంది ఎన్జీవోల సంబంధించిన వారిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తుండగా.. ఆరుగురు ప్రభుత్వం ఉద్యోగులను కూడా సీబీఐ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో పెద్దఎత్తున డబ్బులను రాబడుతోన్న వ్యవహారాలను కేంద్రం సీరియస్గా…
పాకిస్థాన్ అంతర్గత అంశాలు ఎలా ఉన్నారు.. ఇప్పుడు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.. భారత్తో పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చింది.. దీనికోసం ప్రత్యేకంగా ఓ మంత్రిని కూడా నియమించింది పాకిస్థాన్. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్కు ఇదో ఊరట అని విశ్లేషిస్తున్నారు.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో, భారత్తో వాణిజ్యాన్ని పునఃప్రారంభించే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇక, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన కమర్…
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న దేశద్రోహం కేసులపై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. దేశద్రోహ నేరాన్ని నేరంగా పరిగణించే IPCలోని సెక్షన్ 124Aలోని నిబంధనలను పునఃపరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరుచేసింది. ఈ కేసులకు సంబంధించిన పునఃపరీక్ష పూర్తయ్యే వరకు 124ఏ కింద ఎలాంటి కేసు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేయాలని సీజే ఎన్వీ రమణ ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. దేశద్రోహం కేసుపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.…
అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. విదేశాలనుంచి బంగారం, డ్రగ్స్, ఇతర నిషేధిత వస్తువులు తెస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాఆ కోల్ కత్తా లో కోటి రూపాయల విలువ చేసే మూడు అరుదైన విదేశీ కోతులను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ కోతులను విదేశాల నుండి అస్సాం మీదుగా బెంగాల్ లోని సిలిగురికి రవాణా చేస్తున్నారు కేటుగాళ్లు. విశ్వసనీయ సమాచారం మేరకు మైనాగురి జాతీయ రహదారి పై ఓ బస్సు ను అడ్డుకున్నారు కస్టమ్స్ బృందం. బస్సు ను క్షుణ్ణంగా తనిఖీలు…
దేశంలో కరోనా నాలుగో వేవ్ రాకపోవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వైరస్ సోకడంతో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి లభించింది. ఐఐటీ కాన్పూర్ సూత్ర మోడల్ ప్రకారం… 90 శాతం మంది భారతీయులకు ఈ సహజ నిరోధకత లభించినట్లు వెల్లడించింది. ఇటీవల కేసులు పెరిగినా… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తే, నాలుగో వేవ్కు అవకాశం ఉంటుంది. అంతేకానీ… వైరస్ తీవ్రతను తగ్గించుకునేందుకు టీకా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. Read Also:…