పల్నాడు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ టైగర్స్
తెలుగు రాష్ట్రాల్లో పులులు, చిరుతల సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పల్నాడు అటవీ ప్రాంతంలో కొనసాగుతుంది ఆపరేషన్ టైగర్స్. వెల్దుర్తి, దుర్గి ,కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లో కొనసాగుతున్న టైగర్ సెర్చ్ ఆపరేషన్.. టైగర్ సెర్చ్ కోసం మాచర్లలోనే మకాం వేశారు పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారులు. కండ్రిక ,కనుమల చెరువు ,కాకిరాల అడి గొప్పల, లోయపల్లి గ్రామాలలో 100 కిలో మీటర్ల పరిధి అటవీ ప్రాంతంలో కొనసాగుతుంది అన్వేషణ. టైగర్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి 20 బృందాలు. పులుల జాడ కోసం అటవీ ప్రాంతంలో అత్యాధునిక కెమెరాలను అమర్చుతున్నారు ఫారెస్ట్ అధికారులు. రెండు, మూడు రోజుల్లో పులుల జాడ కనుగొంటామని అంటున్నారు అటవీ శాఖ అధికారులు.గత కొంతకాలంగా పల్నాడు జిల్లాలోని నల్లమల రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు పెద్ద పులుల సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇటీవల దుర్గి మండలం కాకిరాల, అడిగొప్పుల అటవీ ప్రాంతంలో ఓ ఆవుపై పులులు దాడి చేసి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలంలో జనం ఆందోళనకు గురవుతున్నారు. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లోని శివారు పల్లెల్లో పులి సంచారం అలజడి రేపుతోంది. పల్నాడులోని లోయపల్లి, గజాపురంతోపాటు వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో వ్యాఘ్రాలు ఆహారం, నీటి కోసం పొలాలు, వాగుల వెంబడి బయట సంచరిస్తున్నాయి. దీంతో పశువులు, జీవాలు వీటి బారినపడి అసువులు బాస్తున్నాయి. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 75 వరకు పులులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 26న దుర్గి మండలం గజాపురం సమీపంలో ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. పాదముద్రలను బట్టి పులేనని అటవీ అధికారులు నిర్ధారణ చేశారు. వెల్దుర్తి మండలం లోయపల్లి ప్రాంతంలో జీవాలు, పశువులపై పలుమార్లు దాడి చేసినట్లు- కాపర్లు, అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ శాఖ తమ పావులు కలుపుతుంది. ఇప్పటికే భారీ స్థాయిలో సిబ్బందిని పెంచిన సరైన రీతిలో ఫలితాలు రావడం లేదు. దీనిని దృష్టిలో పెంచుకునే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున లో అండ్ ఆర్డర్ తో పాటుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జంట నగరాల్లో ఏకంగా 40 పైగా పోలీస్ స్టేషన్లో కొత్తవి రాబోతున్నాయి. అంతేకాకుండా భారీ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా వస్తున్నాయి. దీనికి తోడు ప్రతి జోన్లో కూడా మహిళ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు .మరోవైపు డ్రగ్స్ కట్టడికో కొరకు నార్కోటిక్ బ్యూరో తో పాటుగా సైబర్ క్రైమ్ కంట్రోల్ కోసం సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కూడా చకచగా జరిగిపోతున్నాయి. రానున్న 15 రోజుల్లో కొత్త పోలీస్ స్టేషన్లు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎందుకు సంబంధించి జంట పోలీస్ కమిషనర్లు ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు. మరోవైపు ఆరు కొత్త డిసీపీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదు నగరంలో ఏకంగా 11 ఏసీబీ స్థాయి అధికారులు పోస్టులను అప్డేట్ చేశారు. దేనికి తోడు 14 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు 14 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కూడా నిర్మించబోతున్నారు. అదే తరహాలో ప్రతి జోన్ లో కూడా మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి తోడు మరొక ఐదు పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నూతనంగా నిర్మించిన సెక్రటేరియటుకు అనుకొని కొత్తగా సచివాలయ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో నిత్యం బందోబస్తులతో సతమతమవుతున్న గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కి కొద్దిగా భాగాన్ని కట్ చేసి దోమలు గూడ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. దీని పరిధిలో ధర్నా చౌక్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. రాంనగర్, వారాసిగూడ ప్రాంతాలు విపరీతంగా జనాభా పెరిగిపోయింది.
పెంపుడు జంతువులకి ట్రైన్ లో ఆన్లైన్ టికెట్
ట్రైన్ ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో పెట్స్ లవర్స్ కి ఈ వార్త ఉపశమనం కలిగించినట్లైంది. పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో మనుషులతో సమానంగా వాటిని ట్రీట్ చేశారు. ఆ పెంపుడు జంతువులకు ఏదైనా జరిగితే అస్సలు తట్టుకోలేరు. పొరపాటున పెంపుడు జంతువులు తప్పిపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్ళేందుకు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రైలు ప్రయాణ సమయంలో అస్సలు కుదరదు. అటు వదిలి ఉండలేక, ఇటు తమతో తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారతీయ రైల్వే త్వరలో ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పెంపుడు కుక్కలు, పిల్లుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యాన్ని స్టా్ర్ట్ చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రతిపాదనను రెడీ చేసింది. తమతో పాటు పెంపుడు జంతువుల కోసం ఇంట్లో నుంచే టిక్కెట్లను బుక్ చేసుకునేలా ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఇకపై IRCTCలో పెంపుడు జంతువులకు టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం యజమానులు తమ పెంపుడు జంతువుల కోసం రైళ్లలో 1వ తరగతి AC టిక్కెట్లు, క్యాబిన్‌లను బుక్ చేసుకుంటున్నారు.
మురికికాలువలో కరెన్సీ నోట్లు.. వీడియో వైరల్
పారే మురికి కాల్వను చూడటానికి ఘోరంగా ఉంటుంది. అందులో నీళ్లు కంపు కొడుతున్నాయి. దుర్వాసనతో దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్తా చెదారమే. అటు వైపు వెళ్లేందుకే కాదు కదా.. కనీసం చూడటానికి కూడా జనాలు ఇష్టపడరు. అలాంటి మురికి కాల్వలో ఒక్కసారిగా కలకలం రేపుతుంది. జనాలు పెద్ద సంఖ్యలో మురికి కాల్వలోకి దిగారు. కంపు, దుర్వాసన, చెత్తా చెదారాన్ని అస్సలు లెక్క చేయలేదు. ఆ మురికి కాల్వలోకి దూసుకెళ్లారు. ఎందుకో తెలుసా? కరెన్సీ నోట్ల కోసం ఎగబడ్డారు. ఏందీ మీరు షాక్ అయ్యారా? అవునండీ.. మురికి కాలువలో పెద్ద సంఖ్యలో కరెన్సీ నోట్లు దర్శనం ఇచ్చాయి. డబ్బంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ నోట్లను ఏరుకునేందుకు జనాలు మురికి కాల్వలోకి దిగారు. ఈ ఘటన బీహార్ లోని రోహ్తాస్ జిల్లా మోరాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ పారే మురికి కాల్వలో కరెన్సీ నోట్లు ప్రత్యేక్షమయ్యాయి. నోట్ల కట్టలు తీసుకునేందుకు ప్రజలు పోటీలుపడ్డారు. దొరికిన వారు దొరికినంత డబ్బుల కట్టలను తీసుకెళ్లారు. కరెన్సీ నోట్లలో రూ.2వేలు, రూ.500, రూ.100, 10 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. మురికి కాల్వలోకి దిగిన ప్రజలు నోట్ల కట్టలు ఏరుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అన్ని మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే.. కేంద్రం హెచ్చరిక
స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎం రేడియోను సులభంగా యాక్సెస్ చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీదారులకు ఒక సలహాను జారీ చేసింది. అన్ని ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే అని తెలిపింది. దీన వల్ల అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు రేడియో సేవల ద్వారా సమాచారాన్ని అందించడం పాటు వినోదాన్ని అందించేలా సహాయపడుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాలంలో సపరేట్ గా రేడియో సెట్లను కొనుగోలు చేయలేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు రేడియో సేవలను అందుబాటులోకి తీసుకురడానికి భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది IT మంత్రిత్వ శాఖ ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) మరియు మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MAIT) లకు అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ఎఫ్ఎం రేడియో అండుబాటులో ఉండేలా చూడాలని ఓ సలహా జారీ చేసింది. ఇది పేదలకు రేడియో సేవలను అందించడంతో పాటు క్లిష్ట సమయాల్లో ప్రతీ ఒక్కరికి ఎఫ్ఎం కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా చేస్తుంది. మొబైల్ ఫోన్లలో ఇన్ బిల్ట్ ఎఫ్ఎం రేడియో రిసీవర్ ఫీచర్ ఉంటే దాన్ని డిసేబుల్ చేయకుండా, డీయాక్టివేట్ చేయకుండా ఎప్పుడూ యాక్టివేట్ ఉండేలా చూడాలని, ఒక వేళ మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో రిసీవర్ ఫంక్షన్ లేకుంటే దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ మంత్రిత్వ శాఖ సలహా జారీ చేసింది. ఇటీవల కాలంలో ఎఫ్ఎం రేడియోతో మొబైల్ ఫోన్లు రావడం తగ్గిపోయినట్లు ప్రభుత్వం గమనించినట్లు ఐటీ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇది ఎఫ్ఎం సేవలపై ఆధారపడే పేదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. విపత్తులు, క్లిష్ట సమయాల్లో సమాచారా మార్పిడికి ఎఫ్ఎం రేడియో ఉపయోగపడుతుందని ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఫీచర్ చేర్చాలని సిఫారసు చేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పని కరెంట్ కోతల తిప్పలు..
కరెంట్ కోతలు సామాన్యుడికే కాదు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా తప్పడం లేదు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బరిపాడలోని మహారాజా శ్రీ రామచంద్ర భంజదేయో విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవానికి శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ పోయింది. దీంతో లైట్లు ఆఫ్ కావడంతో వేదికపై చీకటి అలుముకుంది. దాదాపుగా తొమ్మిది నిమిషాల పాటు పవర్ కట్ ఏర్పడింది. హై సెక్యూరిటీ ప్రోగ్రామ్ లో ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం 11.56 నుంచి 12.05 నిమిషాల పాటు విద్యుత్ కోత ఏర్పడింది. రాష్ట్రపతి ముర్ము ప్రసంగం ప్రారంభం అయిన తర్వాత కొద్ది సేపటికే ఇది జరిగింది. అయితే ఆమె మాట్లాడే మైక్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుండటంతో ఆమె ప్రసంగాన్ని కొనసాగించారు. కరెంట్ పోయిన సభకు విచ్చేసిన వారు ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఒడిశా రాష్ట్రపతి సొంతరాష్ట్రం. మయూర్ భంజ్ జిల్లాలోని రాయ్‌రంగ్‌పూర్‌కు చెందిన ద్రౌపది ముర్మును ఆ ప్రాంత ప్రజలు ‘భూమి పుత్రిక’గా పరిగణిస్తారు.
నేడే నీట్ పరీక్ష.. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు
వైద్య కళాశాలల్లో అడ్మిషన్ కోసం దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET UG 2023) నేడు (మే 7) దేశవ్యాప్తంగా 499 నగరాల్లో 4000 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఇందులో 20 లక్షల 86 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను మరువవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో గరిష్టంగా 582, యూపీలో 451 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా.. రాజస్థాన్‌లోని 24 నగరాల్లో 354 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు హింసాత్మకమైన మణిపూర్‌లో పరీక్ష వాయిదా పడింది. ఆదివారం జరగనున్న దేశంలోనే అతిపెద్ద జాతీయ ప్రవేశ పరీక్షకు సన్నాహాలు పూర్తయినట్లు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి తెలిపారు. దేశవ్యాప్తంగా 499 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 16 లక్షల 72 వేల 912 మంది విద్యార్థులు ఆంగ్ల మాధ్యమాన్ని పరీక్ష మాధ్యమంగా ఎంచుకున్నారు. కాగా హిందీలో 2 లక్షల 76 వేల 175 మంది అభ్యర్థులు చేసుకున్నారు.
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు… సాప్ట్‌వేర్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ అనూహ్య సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ క్రికెట్ స్టేడియంలో శనివారం ( మే 6 ) జరిగింది. మృతుడు మర్రిపూడి మణికంఠది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామమని మహేశ్వరం ఎస్సై నర్సయ్య వెల్లడించారు.మృతుడి సోదరుడు వెంకటేష్ కేబీహెచ్‌పీ కాలనీలో నివాసం ఉంటూ స్టాప్ట్‌వేర్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. మణికంఠ ఏడాది నుంచి కేబీహెచ్‌పీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి సొదరుడు వెంకటేష్ మాట్లాడుతూ.. వారంతంలో తామిద్దరం మరికొంతమంది స్నేహితులతో కలిసి స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటామని తెలిపారు. మణికంఠ శనివారం ఉదయం ఘట్టుపల్లి శివారులోని స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వెళుతున్నట్లు చెప్పాడన్నారు. తర్వాత మధ్యాహ్నం సోదరుడి స్నేహితుడు యశ్వంత్ తనకు ఫోన్‌చేశాడని, మణికంఠ బ్యాటింగ్ అనంతరం ఒకే ఓవర్ బౌలింగ్ వేసి వెన్నునొప్పి వస్తుందంటూ విశ్రాంతి కోసం కారులో పడుకున్నట్లు చెప్పాడన్నారు. కాసేపటి తర్వాత వెళ్లి మణికంఠను పిలిచినా పలకకపోవడంతో వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు. దీంతో మృతుడి ఇంట్లో తీవ్ర విషాదచాయాలు అలుముకున్నాయి. మృతుడు మర్రిపూడి మణికంఠ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అబ్బో.. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారుగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడినప్పుడు.. ఆర్సీబీ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య చాలా టెన్షన్ నెలకొంది. ఆ మ్యాచ్ కు సంబంధించిన అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఇందులో కోహ్లీ గుంగూలీపై దూకుడు చూపుతున్నట్లు కనిపించింది. అయితే మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అయితే శనివారం (మే6) రాత్రి ఇరు జట్లు మళ్లీ తలపడడంతో అభిమానులు మరోసారి హైవోల్టేజ్ డ్రామాను చూడటానికి వేచి ఉన్నారు. మ్యాచ్ లో ప్రతి అభిమాని చూపు కోహ్లీ-దాదా వైపే చూస్తున్నారు. అదే సమయంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈసారి షేక్ హ్యాండ్ ఇస్తారా లేదో చూడాలని అంతా అనుకున్నారు. కానీ ఈసారి అలాంటిదేమీ జరుగలేదు. ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ-సౌరబ్ గంగూలీ ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్ హాఫ్ సెంచరీలతో ఆధారంగా బెంగళూరు 181 పరుగులకు ఆలౌట్ అయింది.