Samantha: ఆ విషయంలో సమంత.. అల్లు అర్జున్ ను వెనక్కి నెట్టేసిందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: ఎన్ని వివాదాలు వచ్చిన సమంత పాపులారిటీ పెరుగుతోనే ఉంది. ప్రస్తుతం తాను అగ్రతారగా వెలుగుగొందుతుందన్న విషయం స్పష్టమైంది. స్టార్ హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. సినిమా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర తారలను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రెటీ జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన ఈ జాబితాలో సమంత ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది.
Read Also:Dimple Hayathi: పాపకు బంగారంతో గుడి కట్టాలంట ఫ్రెండ్స్
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించగా సమంత మొదటి స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను సైతం వెనక్కి నెట్టి సమంత అగ్ర స్థానంలో నిలవడం చెప్పుకోదగిన విషయం. ఇదే జాబితా గతంలో రిలీజ్ చేయగా తొమ్మిదో స్థానంలో నిలిచిన సమంత.. ఇప్పుడు తొలి స్థానానికి చేరుకున్నారు. ఈ లిస్టులో దక్షిణాదికి చెందిన మరో ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే 17వ స్థానంలో ఉంది. ఈ లిస్టులో సమంతకు అగ్ర స్థానం రావడం ఆమె క్రేజ్ కి నిదర్శనంగా మారింది.
Read Also:Jabardasth Mahesh: ప్రభాస్ కామెడీ.. చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయింది
అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావ’ సాంగ్ చేసి క్లాస్, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ను ఊపేసింది. మొన్నటివరకు మాయోసైటిస్ వ్యాధితో బాధపడింది. కాస్త కోలుకుని తిరిగి సినిమాలతో బిజీ అయింది. రీసెంట్గా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం రాజ్- డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంద. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ మూవీతో బాలీవుడ్ లో పాగా వేయాలని చాలా కష్టపడుతుందట సామ్. ఈ సిటాడెల్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా కూడా చేస్తోంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!