మరో ఐదు నెలల్లో భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు ముందే పాకిస్తాన్ ఫుల్ జోష్ లో ఉంది. బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ టీమ్.. వన్డేలలో ఇప్పుడు వరల్డ్ నెంబర్ వన్ టీమ్ గా నిలిచింది. స్వదేశంలో న్యూజిలాండ్ ను వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడించింది. ఈ ఘనతను అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్.. 113 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తాన్ 113 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ కూడా 113 పాయింట్లతోనే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో భారత్ తర్వాత ఇంగ్లాండ్ (111), న్యూజిలాండ్ (107), సౌతాఫ్రికా (101) , బంగ్లాదేశ్ (95), శ్రీలంక (86), వెస్టిండీస్ (72) , అఫ్గానిస్తాన్ (71) లు టాప్ -10లో నిలిచాయి.
Icc
Also Read : The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఫస్ట్ డే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్
పాకిస్తాన్ వన్డే చరిత్రలో ఐసీసీ వన్డే ర్యాంకింగులలో నెంబర్ వన్ స్థానాని చేరుకోవడం ఇదే తొలిసారి. 2005లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. ఈ 18 సంవత్సరాలలో పాకిస్తాన్ బెస్ట్ ర్యాంక్ మూడో స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు నెంబర్ వన్ జట్టుగా నిలిచింది. ఇంతకంటే ముందే 1991 ఆగస్టులో పాకిస్తాన్ వరల్డ్ నెంబర్ వన్ టీమ్ గా నిలిచింది. అప్పుడు కెండిక్స్ ఫార్ములా ప్రకారం ర్యాంకులను ఇచ్చేవారు. కానీ 2005 నుంచి ఐసీసీ ప్రకటిస్తున్న ర్యాంకులే అధికారికంగా నమోదవుతున్నాయి.
Also Read : Internet : ఇండియాలో ఇంటర్నెట్ తెగ వాడేస్తున్నారుగా..
తాజా ర్యాంకులలో పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా, భారత్ కు కూడా 113 పాయింట్లే ఉన్నాయి. ఈ మూడు జట్ల మధ్య స్వల్ప తేడా ఉంది. కానీ పాయింట్ (.) పక్కన ఉండే పాయింట్ల తేడాతో పాక్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్ కు 113.483 రేటింగ్ పాయింట్లు ఉండగా ఆసీస్ కు 113.286, భారత్ కు 112.638 పాయింట్లు ఉన్నాయి. ఇక కివీస్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే పాకిస్తాన్ తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోనుంది. ఇప్పట్లో భారత్, ఆస్ట్రేలియాకు వన్డే సిరీస్ లు కూడా లేకపోవడం కూడా దానికి కలిసొచ్చేదే అంశం. వన్డేలలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉన్నా టీ20, టెస్టు ర్యాంకింగ్స్ లో మాత్రం టీమిండియానే నెంబర్ వన్ స్థానంలో ఉంది.