ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగిపోతుంది.. ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్ లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. 2022 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నెలకోసారైనా ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా అంటే 75.9 కోట్ల మంది ( 52 శాతం ) ఇంటర్నెట్ వాడడం ఇదే తొలిసారి. భారత్ లో ఇంటర్నెట్ వాడకంపై ఇంటర్నెట్ ఇన్ ఇండియా-2022 అనే అంశంపై ఐఏఎంఏఐ, కాంటార్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వచ్చే రెండేండ్లలో 90 కోట్ల మంది వరకు ప్రజలు ఇంటర్నెట్ యూజర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇంటర్నెట్ యూజర్లలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రజలు, 36 కోట్ల మంది పట్టణ వాసులు, ఉన్నారు. పట్టణాల్లో ఆరు శాతం, గ్రామాల్లో 14 శాతం ఇంటర్నెట్ వాడుతున్నట్లు సర్వేలో వెల్లడించారు.
Also Read : Telangana Police: కచ్చితంగా ఉండాల్సిందే.. బైక్ కొనేవారికి పోలీసులు కొత్తరూల్స్
వచ్చే రెండు సంవత్సరాల్లో కొత్త ఇంటర్నెట్ యూజర్లు 56 శాతం గ్రామీణ జనాభా ఉంటారని అంచనా వేశారు. ప్రస్తుతం గోవాలో అత్యధికంగా 70శాతం, బీహార్ లో32 శాతం ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ ను ఎంటర్టైన్మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్స్, సోషల్ మీడియా వేదికల కోసం ఎక్కువగా వాడుతున్నారు అని తెలిపారు. ఇంటర్నెట్ యూజర్లలో 54 శాతం మంది పురుషులు ఉన్నారు.. కానీ 2022లో కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్న వారిలో 57 శాతం మహిళలు ఉన్నారు. రెండేండ్లలో ఇది 65 శాతానికి ఈ సర్వే అంచనా వేసింది. మున్ముందు ఇంటర్నెట్ వాడకంలో మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గుతాయని ఐఏఎంఏఐ, కాంటార్ సంయుక్తంగా నిర్వహించిన నివేదిక పేర్కింది. 2021తో పోలిస్తే 2022లో డిజిటల్ చెల్లింపులు 13 శాతం పెరిగాయి. 33.8 కోట్ల మంది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారిలో గ్రామీణులు 36 శాతం మంది మాత్రమే ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ లో 99 శాతం మంది యూపీఐ వాడుతున్నారని నివేదికలో తేలింది.
Also Read : Patan Cheru : వామ్మో.. ఒక్క ఇంట్లో 120ఓట్లా.. ఎన్నికల అధికారులే షాక్