Indias Gold Demand: పసిడికి భారీగా తగ్గిన గిరాకీ.. అసలు కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indias Gold Demand: భారతీయ సంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానం ఉంది.. పెళ్లి లాంటి పెద్ద కార్యక్రమం నుంచి ఏ చిన్న కార్యక్రమం, శుభకార్యం జరిగినా.. పసిడి ఉండాల్సిందే అనే తరహాకు అలవాటుపడ్డారు.. స్థాయిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి బంగారం ఎక్కువ.. తక్కువ ఉండొచ్చు.. కానీ, బంగారం ఉండాల్సిందేననే నమ్మకం.. ఇక, శుభకార్యాల్లో వధువరులకు గానీ.. ఇతరులకు గానీ.. బంధువులు కూడా పసిడి బహూకరిస్తుంటారు.. అయితే, పసిడి ధరలు క్రమంగా పెరుగుతూ.. సామాన్యులకు అందకుండా పైపైకి కదులుతున్నాయి. దీంతో.. పసిడికి డిమాండ్ తగ్గిపోతోంది.. జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా అంటే ఏకంగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి రావడంతో ఇలా జరిగిందని.. మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.
Read Also: Heroines: రష్మిక, పూజలకు శ్రీలీలను శత్రువును చేసిన నెటిజన్లు.. కారణం ఏంటంటే ?
Also Read
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
ఇక, డబ్ల్యూజీసీ నివేదికలో పేర్కొన్న అంశాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్‌లో పసిడి డిమండ్ 112.5 టన్నులు ఉండగా.. 2022లో అది 135.5 టన్నులకు చేరింది.. అయితే, ఇదే సమయంలో పసిడి ఆభరణాల డిమాండ్ 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. మరోవైపు.. విలువల రూపంలో చూస్తే, పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించాయి.. అంటే రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయింది. నగల డిమాండ్ విలువల్లో 9 శాతం క్షీణించి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పరిమితం కాగా.. బంగారంపై పెట్టుబడుల పరంగా అయితే 17 శాతం తగ్గిపోయింది.. అంటే.. బంగారం డిమాండ్ 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు పడిపోయింది. ఇది కేవలం భారత దేశానికే పరిమితం కాలేదు.. ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ తొలి త్రైమాసికంలో బలహీనంగానే ఉంది.. 13 శాతం క్షీణించి 1,080.8 టన్నులకు పరిమితం అయ్యింది.
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!