దేశంలో గత 24 గంటల్లో 10,093 కొవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది శనివారం నాడు నమోదైన 10,747 కేసుల సంఖ్య కంటే 6 శాతం తక్కువ. గత రెండు వారాల్లో ఇటీవలి ఇన్ఫెక్షన్ల పెరుగుదలలో దేశంలో 10,000 కేసులు నమోదవడం ఇది వరుసగా నాలుగో రోజు.
Indians In Sudan Asked To Stay Indoors Amid Army-Paramilitary Clash: సూడాన్ మరోసారి సంక్షోభంలోకి వెళ్లింది. అక్కడ ఆర్మీ, పారా మిలిటరీ మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరు బలగాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. సుడాన్ రాజధాన ఖార్టూమ్ కాల్పుల చప్పుళ్లతో దద్దరిల్లుతోంది.
ఈ ఏడాది జూన్ లో ఆఫ్గాన్ జట్టు భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆఫ్గానిస్తాన్ చివరగా 2018లో భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆఫ్గానిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది.
13 వేల కోట్ల మోసానికి సంబంధించి భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఆంటిగ్వా, బార్బుడా నుండి తొలగించలేమని ఆదేశ హైకోర్టు తెలిపింది. చోక్సీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా కేసులు 11 వేలు దాటడంతో కరోనా వైరస్ మరోసారి కలవర పెడుతోంది. తాజాగా ఇవాళ కూడా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.