వరల్డ్ వైడ్ గా ఎక్కువ మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణమని అనేక సర్వేలు తెలుపుతున్నాయి. అలాగే ఐదేండ్లుగా భారత్ లో కూడా హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ ఇప్పుడు 30-40 ఏండ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కరకి గుండెపోటుతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది.
భారతదేశం అధ్యక్షతన జరిగిన జీ-20 అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ మూడు రోజుల సమావేశంలో, సుస్థిర వ్యవసాయం కోసం జ్ఞానం, అనుభవం, ఆవిష్కరణల ప్రపంచ భాగస్వామ్యానికి శనివారం ప్రాధాన్యత ఇవ్వబడింది. శ్రీఅన్న సాగు, వినియోగాన్ని పెంచడానికి జీ-20 దేశాలు అంగీకరించాయి.
Green Card: అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముందు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు శాశ్వతంగా అమెరికాలో స్థిరపడేందుకు జారీ చేసే గ్రీన్ కార్డ్ అర్హత నిబంధనలను సరళీకరించింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది
Air India bomb blast: ఖలిస్తానీ అనుకూల వర్గాలు రోజురోజుకు ఇండియా అంటే వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా కెనడా దేశంలో ఉంటూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అక్కడి ప్రభుత్వానికి భారత్ ఎన్నిసార్లు చెప్పినా కూడా చర్చలు తీసుకోవడం లేదు.
భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం, ఈ నెల 9వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 593.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Japan: గత శతాబ్ధకాలంలో మారని చట్టాలను జపాన్ తాజాగా మార్చింది. ప్రపంచంలో అతితక్కువ సెక్స్ సమ్మతి వయసు ఉన్న జపాన్ ఇప్పుడు దాన్ని పెంచింది. సెక్స్ వయోపరిమితిని 13 ఏళ్ల నుంచి 16కి పెంచింది. దీంతో పాటు అత్యాచారాన్ని పునర్నిర్వచించింది. శుక్రవారం జపాన్ పార్లమెంట్ సెక్స్ క్రైమ్ చట్టాలను సవరించింది. మానవహక్కుల సంఘాలు ప్రభుత్వం చర్యలను స్వాగతించాయి. ప్రస్తుతం 16 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఏదైనా లైంగిక చర్యలకు పాల్పడితే దాన్ని అత్యాచారంగా పరిగణిస్తామని నిబంధనలు…
Qoo Neo 7 Proకు సంబంధించి కీలక వివరాలు వెలుబడ్డాయి. కొత్త iQoo స్మార్ట్‌ఫోన్ జూలై 4న ఇండియాలో లాంచ్ కానుంది. వేగన్ లెదర్ బ్యాక్‌ను కలిగి ఉన్న ఆరెంజ్ కలర్ ఆప్షన్లో ఫోన్ డిజైన్‌ను iQoo టీజ్ చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇండియా, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ లు ఆడితే క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా WTCకి గొప్ప ప్రారంభం అవుతుందని అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచులు ఎందుకు లేవు? ఇది కూడా ఐసీసీ ఈవెంట్యే కదా. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మొదలై నాలుగేళ్లు గడిచిపోయాయి.
Foxconn EV Factory: ఫాక్స్‌కాన్ త్వరలో భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఆపిల్ ఐఫోన్‌ను తయారు చేయడంలో పేరుగాంచిన ఫాక్స్‌కాన్ కంపెనీ త్వరలో భారత ఈవీ మార్కెట్లోకి కూడా ప్రవేశించవచ్చు.