2019లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఓ జంట ప్రేమగా మారి పాకిస్థాన్ నుంచి భారతీయ ప్రియుడి కోసం అక్రమంగా ఇండియాలో అడుగుపెట్టిన సీమా హైదర్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెనే కాదు.. సీమా బాయ్ ఫ్రెండ్ సచిన్ మీనా కూడా మిస్సైనట్లు కనిపిస్తుంది. గ్రేటర్ నోయిడాలోని వారి ఇంట్లో ఈ ఇద్దరూ గత రెండు రోజులుగా కనిపించడం లేదని చుట్టుపక్కల వారు తెలిపారు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిస్ట్ స్వార్డ్ అలర్ట్ అయింది. సీమా భారత్లోకి వచ్చిన మార్గంతో పాటు, ఉగ్రవాద సంఘాలతో ఆమెకు ఉన్న సంబంధాలపై విచారణ చేస్తున్నారు.
Read Also: JP Nadda: రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం
వాస్తవానికి సీమా ఇండియాలో ప్రవేశించిన తర్వాత.. ఆమెతో సహా ప్రియుడు సచిన్, అతడి తండ్రి నేత్రపాల్‌ను విదేశీయుల చట్టం కింద ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఇకపోతే.. నాలుగైదు రోజుల నుంచి గ్రేటర్ నోయిడాలో వీరు ఉంటున్న ఇంటి చుట్టూ స్థానిక పోలీసులు పహారా కాస్తున్నారు. గత 4-5 రోజులుగా ఈ జంటను చూడలేదని గ్రామంలోని ఇరుగు పొరుగు వారు చెప్పారు. భారతదేశంలోకి సీమా హైదర్ ప్రవేశానికి సంబంధించిన వివరాలపై ఏటీఎస్ దర్యాప్తు చేస్తుంది. సీమా, ఆమె నలుగురు పిల్లల పాస్‌పోర్టులు సహా ఆమె ఉపయోగించిన సెల్ ఫోన్ లను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Opposition Parties Meeting: బెంగళూరులో విపక్ష పార్టీ నేతల సమావేశం
తాను, సచిన్ ఖాట్మండులో కలుసుకున్నారని.. అక్కడే ఉన్న పశుపతినాథ్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారని సీమా చెప్పింది. సచిన్‌కు పాస్‌పోర్ట్ లేకపోవడంతో సీమా భారత్ కు వచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ లో పరిస్థితులు తీవ్ర గందరగోళంగా ఉన్నప్పటికీ, సీమా తన నలుగురు పిల్లలతో కలిసి కరాచీ నుంచి ఖాట్మండు చేరుకోగలిగింది. అనంతరం నేపాల్ రాజధానిలో సచిన్ మీనాను కలుసుకుంది. సీమా పిల్లలను కూడా సచిన్ తనతో పాటు ఉంచుకునేందుకు అంగీకరించాడు. ఇక సరిహద్దు పోలీసులు సీమాను అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో జెవార్ సివిల్ జడ్జి అధ్యక్షతన జస్టిస్ నజీమ్ అక్బర్ స్పందిస్తూ.. ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యంతో సీమా భారత్ లోకి అక్రమంగా చొరబడలేదని అతడు పేర్కొన్నారు. అయితే, వీరిని పట్టుకునేందు యాంటీ టెర్రటిస్ట్ స్క్వాడ్ గాలిస్తుంది.