పాకిస్థాన్ కు చెందిన వ్లాగర్ అబ్రార్ హసన్ తన బైక్‌లో ఇండియా మొత్తాన్ని చుట్టివచ్చాడు. తన టూర్ 30 రోజుల్లో 7,000 కి.మీ కలియతిరిగాడు. రెండు దేశాల మధ్య శత్రు సంబంధాలు ఉన్నప్పటికీ, ఇండియాలో తనను అపారమైన ఆప్యాయతతో స్వీకరించినట్లు హసన్ తెలిపాడు. తన బైక్ పై ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ముంబై, కేరళ మరియు మరిన్ని నగరాల్లో తిరిగినట్టు తెలిపాడు.
5.4 Magnitude Earthquake hits Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్లో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్మూ కశ్మీర్‌లోని దోడాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఈ భూకంపం వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం సంతోషించాల్సిన విషయం.…
విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన సురేష్ రైనా ఇప్పుడు మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ముందుగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్ లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాట్లు తెలుస్తోంది.
చైనాను దృష్టిలో పెట్టుకొని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్హెడ్లను భారత్ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇం టర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెల్లడించింది.
స్టిండీస్ లో భారత్ పర్యటన ఖరారైంది. జూలై నుంచి ఆగస్టులో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జూలై 20 నుంచి రెండో టెస్టు జరగనుంది.
Five Australia Players Wins Three Formats of ICC Titles: లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటిన ఆసీస్ మొదటి డబ్ల్యూటీసీ టైటిల్ ఖాతాలో వేసుకుంది. టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్…
ప్రధానంగా ఆహార ధరల తగ్గుదల కారణంగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి పడిపోయింది. రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల ఆర్థికవేత్తలు అంచనా వేసిన దానికి అనుగుణంగానే ఉంది.
విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ లో విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో విమాన ఛార్జీల ట్రెండ్స్‌పై జరిపిన అధ్యయనంలో అత్యధిక విమాన ఛార్జీలు భారతదేశంలో (41 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (34 శాతం), సింగపూర్ (30 శాతం), ఆస్ట్రేలియా (23 శాతం) పెరిగినట్లు నివేదిక తెలిపింది.
ఈ నెలాఖరులో జరిగే రాష్ట్ర పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్ పరిచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అధికారిక ప్రదర్శనతో పాటు, ప్రధాని మోదీకి అంకితం చేసిన ప్రత్యేక ‘థాలీ’ రూపంలో అద్భుతమైన స్వాగతాన్ని అందజేస్తారు.
BCCI released schedule of ODI World Cup 2023: ఈ ఏడాది చివరలో మరో క్రికెట్ పండగ ఉన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్ (డ్రాప్ట్ షెడ్యూల్)ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి బీసీసీఐ పంపింది . ప్రపంచకప్ ఆడే మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్‌ను పంపిస్తారు. ఆ దేశాల నుంచి ఫీడ్ బ్యాక్…