భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్లో మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కాగా… ఈరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టగా.. శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది. ఇక ఈరోజు ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 196/2 ఉంది.
ఇదిలా ఉంటే.. ఈరోజు ఆట ముగిసే ముందు యశస్వి జైస్వాల్ తన వెన్నులో సమస్య ఉన్నందున రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత.. రజత్ పాటిదార్ బ్యాటింగ్‌కు దిగాడు. కానీ ఏమీ పరుగులు చేయకుండానే 10 బంతుల్లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ కు దిగాడు. ప్రస్తుతం క్రీజులో శుభమాన్ గిల్ (65) పరుగులు, కుల్దీప్ యాదవ్ (3) పరుగులతో ఉన్నారు.
Australia: ప్రైవేట్ పార్ట్‌లోకి బ్యాటరీలు చొప్పించుకున్న వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే..?
ఇంగ్లండ్ బౌలింగ్ లో జో రూట్, టామ్ హార్ట్‌లీ చెరో వికెట్ తీశారు. ఇక రాజ్‌కోట్ టెస్టులో మరో రెండు రోజులు మిగిలి ఉన్నాయి. భారత్ చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. అంతేకాకుండా.. 300 పరుగులకు పైగా ఆధిక్యం కూడా సాధించారు. దీంతో.. ఇంగ్లండ్‌కు కాస్త కష్టంగా మారింది.
అంతకుముందు ఇంగ్లండ్‌ను భారత్ 319 పరుగుల వద్ద ఆలౌట్ చేసింది. దీంతో భారత జట్టు 126 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత్ బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రా, అశ్విన్ కు చెరో వికెట్ దక్కింది.