ISRO Chairman Somanath: 4 నెలల్లో.. నాలుగు రాకెట్ ప్రయోగాలు-ఇస్రో చైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO Chairman Somanath: 4 నెలల్లో.. మరో నాలుగు రాకెట్ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రయోగించే GSLV-F14 రాకెట్ విజయవంతం కావాలని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. GSLV F14 ద్వారా INSAT -3DS ఉపగ్రహన్ని ఈ రోజు సాయంత్రం 5.35 కి ప్రయోగిస్తున్నాం. ఈ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాం.. ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ సాఫీగా సాగుతోందని తెలిపారు. ఈ ఉపగ్రహం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాతావరణ పరిస్థితులు, తుఫాన్ లాంటి విపత్తులు, వర్షాభావ పరిస్థితులు, మేఘాల గమనాలు, సముద్ర ఉపరితల మార్పులపై స్పష్టమైన సమాచారం అందజేస్తుందని వెల్లడించారు.
Read Also: Uttam Kumar Reddy: ప్రాజెక్టులపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు
Also Read
ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న సమాచార ఉపగ్రహాలలో కొన్నింటికి కాలం చెల్లడంతో వాటి స్థానంలో అత్యధిక పరిజ్ఞానం కలిగిన ఉపగ్రహాలను పంపిస్తున్నాం అన్నారు డాక్టర్ సోమనాథ్.. ఈ ఉపగ్రహం ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేస్తుందన్న ఆయన.. ఇలాంటి కమ్యూనికేషన్ సాటిలైట్లు రాబోయే కాలంలో మరిన్ని ప్రయోగిస్తాం.. రాబోయే నాలుగు నెలల్లో నాలుగు రాకెట్ ప్రయోగాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇక, GSLV F15 ద్వారా NISSAR ఉపగ్రహ ప్రయోగం జూన్ లో ఉంటుందని ప్రకటించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!