PM Modi: గుజరాత్ గాంధీనగర్‌లో జరిగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. గుజరాత్లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. రాబోయే ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు.. 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ను ఏ శక్తి అడ్డుకోలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారు. ఈ సంఘటనల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Lakshadweep vs Maldives: భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇది విదేశాల కంటే తక్కువ కాదు. ఇక్కడ అనేక అందమైన ద్వీపాలు, బీచ్‌లు ఉన్నాయి. వీటిని చూడటానికి ప్రజలు సుదూర ప్రాంతాలు, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇటీవల అటువంటి అందమైన భారతదేశ ద్వీపం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ స్నార్కెలింగ్ చేస్తూ కనిపించారు. ఆయన పర్యటన అనంతరం లక్షద్వీప్ నిరంతరం ముఖ్యాంశాలలో ఉంది. అదే సమయంలో,…
వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాల్దీవులే. సెలబ్రిటీలు కూడా తరచూ మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి బీచ్‌లు, రిసార్ట్స్‌లో సేద తీరుతుంటారు. ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్‌కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్‌కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్‌గా పెట్టుకుంటుంటారు.
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో 475 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 6గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
లక్షదీవులను భారతదేశంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలావుండగా.. మినీకాయ్ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది. ఇది యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాలను కూడా నిర్వహించగలదు.
భారత్, పాక్ దాయాది దేశాల మధ్య శత్రుత్వం గురించి తెలిసిన విషయం. శత్రువు ప్రాణాలతో దొరికితే విజయగర్వంతో ఆ దేశం మీసం తిప్పుతుంది. 2019 ఫిబ్రవరి 27 భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పట్టుబడిన సమయంలో పాక్‌లో అలాంటి పరిస్థితి లేదు. పాక్ ప్రధానితో సహా ఉన్నతస్థాయి అధికార గణమంతా వణికిపోయారు. రెండు రోజుల్లోనే వర్ధమాన్‌ను విడిచిపెట్టింది పాకిస్థాన్.
ప్రధాని నరేంద్ర మోడీపై, భారత పౌరులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు అధ్యక్షుడు ముయిజ్జును అధికారం నుంచి తప్పించే పనిలో పడ్డాయి.
చైనా పర్యాటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారత పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, మాల్దీవులపై తాము రెచ్చగొట్టడం గానీ, ఒత్తిడి చేయడం గానీ చేయలేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది.