Kailash Mansarovar Yatra: భారత, చైనాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు రోజలు పాటు విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి. దీనిలో వేసవిలో కైలాస్-మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుత ఒప్పందాల ప్రకారం.. దీనికి సంబంధించిన విధానాలను సంబంధిత యంత్రాంగం చర్చిస్తోందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ప్రారంభించాలని సూత్రప్రాయ ఒప్పందం కుదిరింది. Read Also: Nandamuri Balakrishna: బాలకృష్ణని…
Smriti Mandhana: 2024లో అన్ని ఫార్మాట్స్ లో అద్భుతంగా ఆడిన భారత బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా (ICC Women’s ODI Cricketer of the Year) ఎంపికైంది. విషయాన్నీ తాజాగా ఐసీసీ వెల్లడించింది. మంధాన వన్డేలలో కొత్త రికార్డ్స్ ను నెలకొల్పింది. 2024లో 13 ఇన్నింగ్స్‌లలో 747 పరుగులు చేసి క్యాలెండర్ ఇయర్లో మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ పరుగులు చేసింది. Also Read:…
Gallantry Service Medals: 2025 రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు చెందిన మొత్తం 942 మంది సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డు లభించనున్నాయి. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పతకాలు, 101 మందికి విశిష్ట సేవలందించినందుకు రాష్ట్రపతి పతకం, 746 మందికి ప్రతిభ కనబర్చిన పతకాలు లభించాయి. 95 గ్యాలంట్రీ అవార్డులలో ఎక్కువ భాగం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన సైనికులకు ఇవ్వబడ్డాయి. ఇందులో నక్సలైట్ల ప్రాంతానికి చెందిన 28…
Tahawwur Rana: అమెరికా సుప్రీం కోర్టు శనివారం 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు తహవ్వూర్ రాణాను భారత్‌కు పంపించేందుకు ఆమోదం తెలిపింది. 2008 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన తహవ్వూర్ రానా, పాకిస్తాన్ మూలానికి చెందిన కెనడియన్ పౌరుడిగా గుర్తించబడ్డాడు. రానా అప్పగింతను అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించింది. జనవరి 21న, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, అమెరికా సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను తిరస్కరించింది. ‘పిటీషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని కోర్టు…
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగనుంది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపిస్తుంది. Also Read: Vijayasai Reddy Resigns: రాజ్యసభ…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థాన్ ఉగ్రవాది పన్ను హాజరుకావడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కనిపించడంపై విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయాన్ని అమెరికాతో భారత్ లేవనెత్తుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దేశ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను అమెరికాతో భారత్ లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన శుక్రవారం తెలిపారు.